ఆల్ మోస్ట్ ఫిక్స్: రాముడిగా హృతిక్?

Thursday,August 01,2019 - 01:08 by Z_CLU

దాదాపు 1500 కోట్ల రూపాయల బడ్జెట్ తో రామాయణం తీయడానికి రెడీ అవుతున్నాడు మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్. ప్రైమ్ ఫోకస్ సంస్థతో కలిసి నిర్మించనున్న ఈ సినిమా కోసం ఇప్పటికే కాస్టింగ్ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఇందులో భాగంగా రాముడి పాత్ర కోసం హృతిక్ ను సంప్రదించారు. హృతిక్ దాదాపు ఓకే చెప్పాడు.

ఈ సినిమాలో రాముడి పాత్ర కోసం మొన్నటివరకు రామ్ చరణ్ పేరు గట్టిగా వినిపించింది. అయితే చరణ్ కంటే హృతిక్ అయితే పాన్-ఇండియా అప్పీల్ ఉంటుందనే భావనతో అతడితో చర్చలు జరిపారు. మూడు భాగాలుగా రాబోతున్న రామాయణ్ లో హృతిక్ ఎంట్రీ దాదాపు ఫిక్స్ అయినట్టే.

దంగల్, మామ్ చిత్రాల్ని డైరక్ట్ చేసిన నితీష్ తివారి, రవి ఉద్యావార్ లకు ఈ 3 భాగాల్ని తెరకెక్కించే బాధ్యతల్ని అప్పగించారు. తొలి భాగానికి నితీష్ తివారి దర్శకుడు. డిసెంబర్ లో రామాయణ్ పార్ట్-1 రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుంది.