"గ్యాంగ్" టీజ‌ర్ రిలీజ్.. జనవరి 12న మూవీ రిలీజ్

Thursday,December 14,2017 - 12:17 by Z_CLU

జ్ఞానవేళ్ రాజా నిర్మాతగా సూర్య కథానాయకుడిగా విగ్నేష్ శివన్ దర్శకత్వంలో రూపొందించిన “తాన సెరంధ కూటమ్” అనే తమిళ చిత్రాన్ని తెలుగులో యు. వి. క్రియేషన్స్ బ్యానర్లో “గ్యాంగ్” పేరుతో స‌క్రాంతి సంద‌ర్బంగా జ‌న‌వరి 12న భారీగా రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ఇటీవ‌లే విడుద‌ల‌ చేశారు. ఇప్ప‌డు ఫ‌స్ట్‌లుక్ టీజ‌ర్ ని విడుద‌ల చేశారు.

విడుద‌ల చేసిన కొన్ని గంట‌ల్లోనే ఈ టీజర్ కు మిలియ‌న్ వ్యూస్ చూడ‌టం.. రెండు ల‌క్ష‌ల లైక్స్ రావ‌టం విశేషం. ఈ చిత్రంలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటించింది. ర‌మ్య‌కృష్ణ, కార్తీక్ కీలక పాత్రలు పోషించారు. మ్యూజిక్ సెన్సేష‌న్ అనిరుథ్ సంగీతమందించాడు.

ఈ సినిమాకు సూర్య స్వయంగా డబ్బింగ్ చెప్పుకున్నాడు. టీజర్ లో సూర్య వాయిస్ అందర్నీ ఎట్రాక్ట్ చేస్తోంది. జనవరి 12, 2018న ఈ చిత్రాన్ని ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నట్టు యువి క్రియేషన్స్ నిర్మాతలు ప్రమోద్, వంశీ ప్రకటించారు.