"గ్యాంగ్" ప్రీ-రిలీజ్ ఈవెంట్

Wednesday,January 03,2018 - 01:05 by Z_CLU

ఈ సంక్రాంతికి వస్తున్న ఏకైక డబ్బింగ్ మూవీ గ్యాంగ్ . ఓవైపు పవన్, మరోవైపు బాలకృష్ణ లాంటి హీరోల సినిమాలు బరిలో ఉన్నప్పటికీ.. గ్యాంగ్ సినిమాతో అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నాడు సూర్య. స్టుడియో గ్రీన్ సంస్థ నిర్మించిన ఈ సినిమాను తెలుగులో యూవీ క్రియేషన్స్ సమర్పిస్తోంది. ఇప్పటికే మూవీకి సంబంధించి ట్రయిలర్ విడుదలైంది. తాజాగా ప్రీ-రిలీజ్ ఫంక్షన్ కు డేట్ ఫిక్స్ చేశారు.

ఈనెల 5న (శుక్రవారం) గ్యాంగ్ మూవీ ప్రీ-రిలీజ్ ఫంక్షన్ ను సెలబ్రేట్ చేయబోతున్నారు. హైదరాబాద్ లోని జేఆర్సీ కన్వెన్షన్ లో శుక్రవారం సాయంత్రం 6 గంటల నుంచి ఈ వేడుక జరగనుంది. హీరో సూర్య, హీరోయిన్ కీర్తి సురేష్… ఈ ఫంక్షన్ లో ప్రత్యేక ఆకర్షణ.

విఘ్నేష్ శివన్ దర్శకత్వంలో తెరకెక్కింది గ్యాంగ్ సినిమా. అనిరుధ్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. జనవరి 12న మూవీని విడుదల చేయబోతున్నారు.