సూర్యకాంతం ట్రయిలర్ రివ్యూ

Tuesday,March 26,2019 - 05:09 by Z_CLU

టీజర్ తో టోటల్ టాలీవుడ్ ను తనవైపు తిప్పుకుంది ‘సూర్యకాంతం’. ఆల్ మోస్ట్ ఆ క్వాలిటీస్ అన్నీ ఇప్పుడు ట్రయిలర్ లో కూడా కనిపిస్తున్నాయి. కొద్దిసేపటి కిందట విడుదలైన సూర్యకాంతం ట్రయిలర్ చూస్తే పెర్ ఫెక్ట్ ఎమోషనల్ లవ్ జర్నీ ఫీల్ కలుగుతుంది.

అభి అనే వ్యక్తి జీవితంలోకి సూర్యకాంతం అనే డిఫరెంట్ క్యారెక్టర్ ఎంటరైతే ఏమౌతుంది? సరిగ్గా ఇదే లైన్ చుట్టూ తీసిన సినిమా సూర్యకాంతం. ట్రయిలర్ చూస్తునే ఈ విషయం అర్థమౌతుంది. సాఫ్ట్ గా ఉండే పూజ, రెబల్ సూర్యకాంతం మధ్య నలిగిపోయే పాత్రలో రాహుల్ విజయ్ కనిపిస్తున్నాడు.

ఇక సూర్యకాంతం పాత్ర పోషించిన నిహారిక కొణెదల, ఆ పాత్రకు అతికినట్టు సెట్ అయింది. ట్రయిలర్ లో ఆమె లుక్స్, కాస్ట్యూమ్స్ బాగున్నాయి. హీరోహీరోయిన్లతో పాటు మిగతా కీలక పాత్రల్ని కూడా ట్రయిలర్ లోనే పరిచయం చేశారు. క్లయిమాక్స్ లో ఏం జరుగుతుందనే క్యూరియాసిటీని పెంచేలా ట్రయిలర్ ను నీట్ గా కట్ చేశారు.

ముద్దపప్పు-ఆవకాయ్, నాన్నకూచి లాంటి వెబ్ సిరీస్ లు తీసిన ప్రణీత్ ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. ఓవర్సీస్ లో సూపర్ హిట్ అనిపించుకున్న నిర్వాణ సినిమాస్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ మూవీకి మార్క్ రాబిన్ సంగీతం అందించాడు. ఓవరాల్ గా సూర్యకాంతం ట్రయిలర్, సినిమాపై అంచనాల్ని మరింత పెంచింది. ఈ వీకెండ్ ఎట్రాక్షన్ గా థియేటర్లలోకి రాబోతోంది సూర్యకాంతం.