జెర్సీ సరికొత్త స్పోర్ట్స్ సీజన్ ని క్రియేట్ చేస్తుందా..?

Tuesday,March 26,2019 - 05:05 by Z_CLU

ఏప్రియల్ 19… ఫ్యాన్స్ డైరీలో ఈ డేట్ ని బోల్డ్ అక్షరాలతో రాసి పెట్టుకున్నారు. నాని ‘జెర్సీ’ థియేటర్స్ లోకి రాబోతున్న రోజది. ఈ న్యాచురల్ స్టార్ ఏ సినిమా చేసినా దానికి బజ్ క్రియేట్ అవ్వడం కూడా అంతే న్యాచురల్ అనుకోండి, కాకపోతే ‘జెర్సీ’ విషయంలో మాత్రం ఆ క్రేజ్ పదింతలు కనిపిస్తుంది. అయితే దానికీ ఓ కారణం ఉంది.

నాని ఇప్పటి వరకు చేసిన సినిమాలన్నీ ఓ లెక్క… ఈ సినిమా ఇంకో  లెక్క అని గట్టిగా చెప్పలేం కానీ టాలీవుడ్ లో వరసగా రిలీజవుతున్న సినిమాలు ఓ లెక్క, ఈ ‘జెర్సీ’ సినిమాది మాత్రం డెఫ్ఫినెట్ గా స్పెషల్ లెక్క. ఎందుకంటే ఇది స్పోర్ట్స్ బేస్డ్ ఎంటర్ టైనర్. అందునా మోస్ట్ క్రేజీయెస్ట్ స్పోర్ట్ క్రికెట్ చుట్టూ తిరిగే కథ.

 

సాధారణంగా స్పోర్ట్స్ ఎంటర్టైనర్స్ అంటే బిగినింగ్ లో ఓ ఫెయిల్యూర్, ఆ తరవాత ఓ గట్టి రియలైజేషన్ పాయింట్… అక్కడి నుండి లీడ్ రోల్ స్ట్రగుల్, క్లైమాక్స్ లో గెలిచేయడం. స్పోర్ట్ ఏదైనా ప్లాట్ మాత్రం ఇదే ఉంటుంది. కానీ ‘జెర్సీ’ ఏ మాత్రం రెగ్యులర్ ఫార్మాట్ లో ఉండబోదు. ఈ సినిమాలో క్రికెట్ ఎలిమెంట్స్ ఎంతగా ఉండబోతున్నాయో ఎమోషనల్ గా అంతే ఎంటర్టైన్ చేయనుంది.

సినిమాలోని క్రికెట్ ఎలిమెంట్స్ యూత్ దగ్గరి నుండి పిల్లల వరకు థియేటర్స్ వైపు ఎట్రాక్ట్ చేస్తే, నాని రెగ్యులర్ ఫ్యామిలీ ఆడియెన్స్ ఎలాగూ ఈ సినిమా కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. రిలీజ్ కి ముందే ఈ సినిమా క్రియేట్ చేస్తున్న వైబ్స్, ఎగ్జాక్ట్ గా బాక్సాఫీస్ దగ్గర కూడా ట్రాన్స్ లేట్ అయితే, డెఫ్ఫినెట్ గా ఈ ‘జెర్సీ’ టాలీవుడ్ లో సరికొత్త స్పోర్ట్స్ సీజన్ ని క్రియేట్ చేస్తుందనే అనిపిస్తుంది. ఈ సినిమా తరవాత మరిన్ని స్పోర్ట్స్ బేస్డ్ ఎంటర్ టైనర్స్ వచ్చే అవకాశాలైతే బోలెడు కనిపిస్తున్నాయి.