డిఫెరెంట్ లవ్ ఎంటర్ టైనర్ గా నిహారిక ‘సూర్యకాంతం’

Tuesday,December 18,2018 - 07:46 by Z_CLU

నిహారిక కొత్త సినిమా ‘సూర్యకాంతం’ ఫస్ట్ లుక్ వరుణ్ తేజ్ చేతుల మీదుగా రిలీజయింది. నిహారిక బర్త్ డే సందర్భంగా ఈ రోజు ఈ ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమా టైటిల్ ఎంత క్లాసిక్ గా ఉందో, అంతే డిఫెరెంట్ ఉన్న ఈ ఫస్ట్ లుక్ పోస్టర్ నెటిజన్స్ ఎట్రాక్ట్ చేస్తుంది.

ఓ వైపు కంప్లీట్ గా వైట్ కాస్ట్యూమ్స్ లో ప్లెజెంట్ మోడ్ లో ఉన్న  రాహుల్ విజయ్, నిహారికలను అదే పోస్టర్ లో బ్లాక్ అండ్ వైట్ అవుట్ ఫిట్స్ లో గొడవ పడుతున్నట్టు ప్రెజెంట్ చేశారు మేకర్స్. ఈ సినిమా స్టోరీలైన్ లాంటి డీటేల్స్ అయితే ప్రస్తుతానికి బయటికి రాలేదు కానీ,  సినిమా డెఫ్ఫినేట్ గా డిఫెరెంట్ గా ఉండబోతుందనే ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది ఈ పోస్టర్.

ఈ సినిమాలో సుహాసినీ తో పాటు శివాజీ రాజా కీ రోల్స్ ప్లే చేస్తున్నారు. ప్రణీత్ బ్రహ్మాండవల్లి ఈ సినిమాకి డైరెక్టర్. మార్క్ K. రాబిన్ మ్యూజిక్ కంపోజ్ చేసిన ఈ సినిమాని సందీప్ యెర్రం రెడ్డి, సృజన ఎర్రబాబు, రామ్ నరేష్ సంయుక్తంగా నిర్వాణ సినిమాస్ బ్యానర్ పై తెరకెక్కించారు.