చిన్నారులకు మహేష్ కానుక

Tuesday,November 01,2016 - 02:53 by Z_CLU

మురుగదాస్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న మహేష్ బాబు తన కో స్టార్స్ ని గిఫ్ట్ బాక్స్ తో సర్ ప్రైజ్ చేశాడు. మహేష్ బాబుకి కో-స్టార్స్ అంటే ఎవరో బడా బడా సినిమా స్టార్స్ అనుకునేరు. కాదు మహేష్ బాబుతో కలిసి మురుగదాస్ సినిమాలో నటించిన ఒక ప్రైవేట్ స్కూల్ పిల్లలు.

హైదరాబాద్ లో షూటింగ్ జరుపుకుంటున్న మహేష్ బాబు సినిమాలో ఒక సీన్ కోసం దాదాపు 2,500 పిల్లలు నటించారు. షూటింగ్ అయిపోయాక మహేష్ బాబు వాళ్ళతో కలిసి ఫోటోలు దిగుతూ కాస్త టైం కూడా స్పెండ్ చేశాడు, అలాగని అంతటితో సరిపెట్టుకోలేదు.

mahesh-babu

దీపావళి రోజున తనతో షూటింగ్ లో పాల్గొన్న పిల్లలందరికీ చాక్లెట్స్ తో పాటు సాఫ్ట్ డ్రింక్ ని పంపించిన మహేష్ బాబు, ఆ గిఫ్ట్ బాక్స్ ని సరికొత్తగా డిజైన్ చేయించాడు. ప్రతి బాక్స్ పై తాను పిల్లలతో దిగిన ఫోటోని అంటించి, దానికి తోడు బాక్స్ ఓపెన్ చేయగానే పిల్లలకు థాంక్స్ చెప్తూ, స్వయంగా తాను సంతకం చేసిన థాంక్స్ కార్డును కూడా పెట్టించాడు మహేష్ బాబు.