అరవింద సమేత టీజర్ లో సునీల్

Thursday,August 16,2018 - 11:53 by Z_CLU

అరవింద సమేత టీజర్ అదిరిపోయింది. అంతా టీజర్ ను, అందులో ఎన్టీఆర్ లుక్, త్రివిక్రమ్ డైలాగ్స్ ను ఎంజాయ్ చేశారు. అయితే ఈ క్రమంలో టీజర్ లోనే మరో ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్ ను కొంతమంది మిస్ అయ్యారు. అదే సునీల్ ఎప్పీయరెన్స్. అవును.. అరవింద సమేత టీజర్ లో సునీల్ కూడా ఉన్నాడు. మరోసారి టీజర్ ను జాగ్రత్తగా చూస్తే.. 2-3 ఫ్రేమ్స్ లో సునీల్ రిఫరెన్స్ ఉంది. ఒక ఫ్రేమ్ లో అయితే సునీల్ స్పష్టంగా కనిపిస్తాడు కూడా.

చూస్తుంటే.. సునీల్ ను రౌడీల నుంచి రక్షించే క్రమంలో ఎన్టీఆర్ చేసిన ఫైట్ సీన్ నే టీజర్ గా విడుదల చేసినట్టున్నారు. ఈ సినిమాకు సంబంధించి సునీల్ ను ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఓ రీజన్ ఉందిక్కడ. అరవింద సమేత మూవీతోనే సునీల్ క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారాడు. మొన్నటివరకు హీరోగా బిజీబిజీగా గడిపిన సునీల్.. ఇప్పుడు తన స్నేహితుడు త్రివిక్రమ్ సినిమాతో క్యారెక్టర్ రోల్స్ కు షిఫ్ట్ అయ్యాడు.

అరవింద సమేతలో కామెడీ పండించడంతో పాటు టీజర్ లో చూసినట్టు కొన్ని కీలకమైన ఎపిసోడ్స్ లో తన యాక్టింగ్ తో కూడా మెప్పించబోతున్నాడు సునీల్. అలా త్రివిక్రమ్ సినిమాతో సునీల్ మరో కొత్త కోణంలో కనిపించబోతున్నాడు.