సోషల్ మీడియాలో అరవింద సమేత తుఫాన్

Thursday,August 16,2018 - 11:37 by Z_CLU

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్న అరవింద సమేత టీజర్ సోషల్ మీడియాలో దుమ్ముదులుపుతుంది. ఇప్పటికే క్రియేట్ అయిన యూట్యూబ్ రికార్డులు, అరవింద సమేత టీజర్ రాకతో చెల్లాచెదురవుతున్నాయి. టీజర్ విడుదలైన 24 గంటల్లో యూట్యూబ్ లో 5.8 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇప్పటికీ ఈ టీజర్ టాప్-3 ట్రెండింగ్ లో కొనసాగుతుండడం విశేషం.

ఇప్పుడు మనం చెప్పుకున్న లెక్క కేవలం యూట్యూబ్ కు మాత్రమే పరిమితం. మిగతా సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ కూడా కలుపుకుంటే అరవింద సమేత టీజర్ కౌంట్ మరింత పెరుగుతుంది. యంగ్ టైగర్ కు సోషల్ మీడియాలో ఉన్న ట్రెమండస్ ఫాలోయింగ్ ను మరోసారి ఎలివేట్ చేసింది అరవింద సమేత టీజర్.

ఈ టీజర్ మరో రికార్డు కూడా సృష్టించింది. సౌత్ లో అత్యంత వేగంగా లక్ష  లైకులు సాధించిన నాలుగో చిత్రంగా నిలిచింది.

మెర్సెల్ – 10 నిమిషాల్లో లక్ష లైకులు

భరత్ అనే నేను – 29 నిమిషాల్లో లక్ష లైకులు

అజ్ఞాతవాసి – 33 నిమిషాల్లో లక్ష లైకులు

అరవింద సమేత – 34 నిమిషాల్లో లక్ష లైకులు