ఫస్ట్ డే కలెక్షన్: దుమ్ముదులిపిన గీతగోవిందం

Thursday,August 16,2018 - 12:58 by Z_CLU

గోవింద్, గీత కలిసి మొదటి రోజు థియేటర్లను రఫ్ఫాడించారు. తొలిరోజు ఈ సినిమాకు ప్రతి సెంటర్ లో హౌజ్ ఫుల్ కలెక్షన్లు వచ్చాయి. అలా మొదటి రోజు గీతగోవిందం సినిమా వరల్డ్ వైడ్ ఏకంగా 9 కోట్ల 66 లక్షల రూపాయల షేర్ సాధించింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమాకు 5 కోట్ల 80లక్షల షేర్ వచ్చింది. విజయ్ దేవరకొండ కెరీర్ లో బిగ్గెస్ట్ ఓపెనింగ్ ఇదే.

మొదటి రోజు హిట్ టాక్ రావడంతో గీతగోవిందం సినిమా మరింత స్ట్రాంగ్ అయింది. ఈరోజు వర్కింగ్ డే అయినప్పటికీ, హైదరాబాద్ తో పాటు కీలకమైన చాలా సెంటర్లలో ఆక్యుపెన్సీ 90 శాతాన్ని దాటిపోయింది. అటు టికెట్ బుకింగ్ సైట్స్ లో అయితే మెయిన్ థియేటర్లలో ఆదివారం వరకు అన్ని షోలు టిక్కెట్లు బుక్ అయిపోయాయి. ఇక సినిమా ఫస్ట్ డే వసూళ్లు ఇలా ఉన్నాయి

ఏపీ, నైజాం ఫస్ట్ డే షేర్
నైజాం – రూ. 1.75 కోట్లు
సీడెడ్ – రూ. 1.10 కోట్లు
ఉత్తరాంధ్ర – రూ. 0.70 కోట్లు
ఈస్ట్ – రూ. 0.48 కోట్లు
వెస్ట్ – రూ. 0.45 కోట్లు
గుంటూరు – రూ. 0.62 కోట్లు
కృష్ణా – రూ. 0.46 కోట్లు
నెల్లూరు – రూ. 0.24 కోట్లు

టోటల్ షేర్ – రూ. 5.80 కోట్లు