గ్రాండ్ గా లాంచ్ అయిన సందీప్ కిషన్ కొత్త సినిమా

Monday,December 17,2018 - 06:03 by Z_CLU

యూత్ ఫుల్ సినిమాల హీరో సందీప్ కిషన్ కొత్త సినిమా లాంచ్ అయింది. జనవరిలో సెట్స్ పైకి రానున్న ఈ సినిమాకి ‘తెనాలి రామకృష్ణ BA.BL’ అనే టైటిల్ ని ఫిక్స్ చేశారు మేకర్స్. ఈ సినిమాలో సందీప్ కిషన్ సరసన హన్సిక హీరోయిన్ గా నటిస్తుంది. భూమిక సినిమాలో కీలకపాత్రలో కనిపించనుంది.

ఈ రోజు పూజా కార్యక్రమాలతో బిగిన్ అయిన ఈ కార్యక్రమనికి అనిల్ సుంకర, భోగవల్లి ప్రసాద్ లు చీఫ్ గెస్ట్ గా అటెండ్ అయ్యారు. ఆల్మోస్ట్ ప్రీ ప్రొడక్షన్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాలో మురళీశర్మ, వరలక్ష్మీ శరత్ కుమార్, వెనెల్ల కిషోర్, పృథ్వీ ఇంపార్టెంట్ రోల్స్ లో నటించనున్నారు.

శేఖర్ చంద్ర మ్యూజిక్ కంపోజ్ చేస్తున్న ఈ సినిమాకి శ్యామ్ K. నాయుడు సినిమాటోగ్రాఫర్. అగ్రహారం నాగిరెడ్డి, సంజీవ్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమా శ్రీ నీలకంఠేశ్వర స్వామి క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కనుంది.