ఈ నరకాసురుడు విలన్ కాదు

Saturday,February 16,2019 - 12:57 by Z_CLU

సినిమాలకు నెగెటివ్ టైటిల్ పెట్టడం కొత్త కాదు. పోకిరి, ఇడియట్, లోఫర్ లాంటివన్నీ నెగెటివ్ టైటిల్సే. ఇప్పుడు వీటికి కొనసాగింపుగా రావణ, నరకాసురుడు లాంటి టైటిల్స్ కూడా వచ్చేస్తున్నాయి. సందీప్ కిషన్ కొత్త సినిమా పేరు నరకాసురుడు. అలా అని ఇందులో సందీప్ కిషన్ విలన్ కాదు. విలన్ల పాలిట నరకాసురుడు అన్నమాట.

అరవింద్ స్వామి, సందీప్ కిషన్, శ్రియ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న నరకాసురుడు ఫస్ట్ లుక్ విడుదలైంది. ఫస్ట్ లుక్ లో అందరూ చాలా ఇంటెన్స్ లుక్ తో కనిపిస్తున్నారు. తమిళనాట తెరకెక్కుతున్న నరకాసురన్ సినిమాకు తెలుగు వర్షన్ ఇది. కార్తీక్ నరేన్ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు.

థ్రిల్లర్ ఎంటర్ టైనర్ గా నరకాసురుడు వస్తున్నాడు. ప్రస్తుతం డబ్బింగ్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అది పూర్తయిన తర్వాత విడుదల తేదీని ప్రకటించనున్నారు దర్శక నిర్మాతలు. ఈ వేసవిలో తెలుగు తమిళ, భాషల్లో ఒకేసారి విడుదల కానుంది ఈ చిత్రం. కోనేరు సత్యనారాయణ నరకాసురుడు సినిమాను నిర్మిస్తున్నారు.