ఏ బ్యానర్ పై ఏ సినిమా వస్తోంది?

Saturday,February 16,2019 - 10:30 by Z_CLU

ఫిలింఛాంబర్ లో ఈ నెల కూడా దాదాపు వందకు పైగా టైటిల్స్ రిజిస్టర్ అయ్యాయి. ఎన్నో కొత్త బ్యానర్లతో పాటు పాపులర్ అయిన మరెన్నో నిర్మాణ సంస్థలు క్యాచీ టైటిల్స్ ను రిజిస్టర్ చేయించాయి. వాటిలో కొన్ని
ఇంట్రెస్టింగ్ ప్రాజెక్టులు చూద్దాం

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ – ఇద్దరి లోకం ఒకటే (యూ ఆర్ మై హార్ట్ బీట్)
బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈసారి మరో మంచి టైటిల్ రిజిస్టర్ చేయించారు. దాని పేరు ఇద్దరి లోకం ఒకటే. దానికి ట్యాగ్ లైన్ గా యూ ఆర్ మై హార్ట్ బీట్ అనే క్యాప్షన్ పెట్టారు. త్వరలోనే రాజ్ తరుణ్, నాగచైతన్య హీరోలుగా చెరో సినిమా చేయబోతున్నారు దిల్ రాజు. ఈ రెండు ప్రాజెక్టుల్లో ఏదో ఒక దానికి ఈ టైటిల్ ఫిక్స్ చేసే ఛాన్స్ ఉంది.

మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ – వాసి వాడి తస్సాదియ్యా
టైటిల్ చూస్తే అర్థమైపోతోంది ఇందులో హీరో ఎవరో. అవును.. నాగార్జునతో చేయబోయే సినిమా కోసం మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ నిర్మాతలు ఈ క్యాచీ డైలాగ్ ను టైటిల్ గా రిజిస్టర్ చేయించారు. ప్రస్తుతానికైతే నాగార్జున నుంచి వీళ్లకు ఎలాంటి గ్రీన్ సిగ్నల్ రాలేదు.

కింగ్ ఆఫ్ ది హిల్ ఎంటర్ టైన్ మెంట్ ఎల్ఎల్పీ – మీకు మాత్రమే చెప్తా
హీరో విజయ్ దేవరకొండ పెట్టిన కొత్త బ్యానర్ ఇది. ఈ బ్యానర్ పై తొలి ప్రయత్నంగా ఓ సినిమాను నిర్మిస్తున్నాడు ఈ హీరో. ఆ ప్రాజెక్టుకు “మీకు మాత్రమే చెప్తా” అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించారు. గమ్మత్తయితే విషయం ఏంటంటే.. ఏ దర్శకుడి సినిమాతో విజయ్ దేవరకొండ లైమ్ లైట్లోకి వచ్చాడో, అదే దర్శకుడ్ని లీడ్ రోల్ లో పెట్టి ఈ సినిమా నిర్మిస్తున్నాడు. అవును.. పెళ్లిచూపులు దర్శకుడు తరుణ్ భాస్కర్ ది
ఇందులో లీడ్ రోల్. ఈ సినిమాతో షమ్మీర్ దర్శకుడిగా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు.

కోన ఫిలిం కార్పొరేషన్- నిశ్శబ్దం
డిఫరెంట్ కాన్సెప్టులు సెలక్ట్ చేసుకునే రైటర్ కమ్ నిర్మాత కోన వెంకటే, ఈసారి నిశ్శబ్దం అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించాడు. ప్రస్తుతం పీపుల్ మీడియా ఎంటర్ టైన్ మెంట్స్ తో కలిసి అనుష్క లీడ్ రోల్ లో ఓ
సినిమాను నిర్మిస్తున్నాడు కోన వెంకట్. బహుశా ఈ సినిమాకే నిశ్శబ్దం అనే టైటిల్ ను ఫిక్స్ చేసే అవకాశముంది.

శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్ – రావణ
మోహన్ బాబుకు చెందిన శ్రీ లక్ష్మీప్రసన్న పిక్చర్స్ బ్యానర్ పై రావణ అనే టైటిల్ రిజిస్టర్ అయింది. ఇది చాలా పవర్ ఫుల్ టైటిల్. మరి ఇంత పవర్ ఫుల్ టైటిల్ తో మోహన్ బాబు ఎలాంటి సినిమా చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. అందులో తనే నటిస్తారా లేక తనయుడు మంచు విష్ణును హీరోగా పెడతారా అనేది చూడాలి.