సోనూ సూద్ రీఎంట్రీ: ఈసారి మరింత బలంగా...!

Saturday,February 16,2019 - 01:08 by Z_CLU

టాలీవుడ్ స్క్రీన్ పై సోనూసూద్ ది ఓ డిఫరెంట్ స్టయిల్. గతంలో కేవలం అతడి కోసం పాత్రలు సృష్టించేవారు మేకర్స్. సీరియస్ విలనీ, కామెడీ విలనీ, స్మూత్ క్యారెక్టర్స్.. ఇలా ఎన్నో వేరియేషన్స్ ఉన్న పాత్రలు పోషించాడు సోనూసూద్. ఇప్పుడీ నటుడు తెలుగులో రీఎంట్రీ ఇస్తున్నాడు

తేజ దర్శకత్వంలో బెల్లంకొండ హీరోగా రాబోతున్న సీత సినిమాలో సోనూ సూద్ విలన్ గా నటిస్తున్నాడు. అభినేత్రి మూవీ తర్వాత సోనూసూద్ తెలుగులో చేస్తున్న సినిమా ఇదే. ఈ మూవీతో మరోసారి తెలుగులో సత్తా చాటాలని భావిస్తున్నాడు ఈ హీరో.

సీత సినిమాలో సోనూ సూద్ పోషిస్తున్న విలన్ పాత్ర చాలా బలంగా ఉంటుందట. నువ్వా నేనా అన్నట్టు హీరోతో తలపడుతుందట. ఇంకా చెప్పాలంటే సినిమాలో హీరో-విలన్ క్యారెక్టర్స్ రెండూ ఈక్వెల్ గా ఉంటాయ.. అరుంధతిలో పశుపతి పాత్రతో ఎంత పేరు తెచ్చుకున్నాడో, సీత సినిమాలో విలన్ పాత్ర సోనూసూద్ కు ఆ రేంజ్ లో కలిసి రావాలని కోరుకుందాం.