చరణ్ సరసన రాశిఖన్నా?

Wednesday,November 02,2016 - 04:00 by Z_CLU

మొన్నటివరకు రిపీట్ కాంబినేషన్లు కోరుకున్న రామ్ చరణ్ ఇప్పుడు మరో హీరోయిన్ ను సెలక్ట్ చేసే పనిలో పడ్డాడు. తన అప్ కమింగ్ మూవీలో రాశి ఖన్నాకు ఈ మెగా హీరో చోటిచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే టాలీవుడ్ లో స్వింగ్ లో ఉన్న రాశిఖన్నాతో దర్శకుడు సుకుమార్ చర్చలు జరిపినట్టు తెలుస్తోంది. త్వరలోనే చెర్రీతో చేయబోయే సినిమాలో రాశిఖన్నాను హీరోయిన్ గా తీసుకునే అవకాశాలున్నాయట.

కాజల్, రకుల్ ప్రీత్ సింగ్ తో ఇప్పటికే సినిమాలు చేసేశాడు చరణ్. మరోసారి వాళ్లకు అవకాశం ఇవ్వలేడు. మరోవైపు సమంత సినిమాలు తగ్గించేసింది. సో… ఆటోమేటిగ్గా నెక్ట్స్ ఛాన్స్ రాశి ఖన్నాకే వస్తుందని చాలామంది భావిస్తున్నారు. త్వరలోనే దీనిపై ఓ అఫీషియల్ స్టేట్ మెంట్ రానుంది.