అదే రిపీట్ చేయబోతున్న సుకుమార్ ?

Friday,March 24,2017 - 09:30 by Z_CLU

స్టార్ డైరెక్టర్ సుకుమార్ ప్రెజెంట్ మరో డిఫరెంట్ సినిమాతో ప్రేక్షకుల ఎంటర్టైన్ చేయడానికి రెడీ అవుతున్నాడు. ఈ సినిమాకోసం ఇప్పటికే రామ్ చరణ్ ను హీరోగా సెలెక్ట్ చేసుకున్న సుక్కు ఈ సినిమాతో రామ్ చరణ్ ను  సరికొత్త లుక్ లో ప్రెజెంట్ చేసి మళ్ళీ చెర్రీ లుక్ తో టాలీవుడ్ లో హాట్ టాపిక్ అవ్వాలని చూస్తున్నాడు…ఇప్పటికే చెర్రీ లుక్ పై ఫోకస్ పెట్టి స్టైలిష్ తో లుక్ గురించి డిస్కస్ చేస్తున్న సుక్కు ఈ లుక్ తో ఫాన్స్ ను ఖుషి చేయాలనీ డిసైడ్ అయిపోయాడు..

ఇప్పటికే ‘1 నేనొక్కడినే’ సినిమాతో మహేష్ ను సిక్స్ బాడీ తో డిఫరెంట్ గా ప్రెజెంట్ చేసి ఆకట్టుకున్న సుకుమార్ లేటెస్ట్ గా ‘నాన్నకు ప్రేమతో’ సినిమాతో ఎన్టీఆర్ ను అల్ట్రా స్టైలిష్ గా చూపించి సెన్సేషన్ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే .. ప్రెజెంట్ ఎన్టీఆర్ లాగే చెర్రీ ని కూడా ఓ డిఫరెంట్ లుక్ లో చూపిస్తూ మరో సారి ఈ లుక్ తో  సెన్సేషన్ క్రియేట్ చేసి సినిమా పై అంచనాలు పెంచాలని చూస్తున్నాడు సుక్కు. మరి పోస్టర్ తో అందరినీ అవాక్కయ్యేలా చేసిన సుక్కు ఈ సినిమాతో చెర్రీ ని ఎలా ప్రెజెంట్ చేస్తాడా…అనే ఎగ్జైట్మెంట్ తో వెయిట్ చేస్తున్నారు మెగా ఫాన్స్.. మరి సుకుమార్ క్రియేట్ చేసే ఈ న్యూ లుక్ ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో..చూడాలి.