కాటమరాయుడు గ్రాండ్ రిలీజ్

Friday,March 24,2017 - 11:36 by Z_CLU

కాటమరాయుడు గ్రాండ్ గా రిలీజైంది. తెలుగు రాష్టాల్లోనే కాక చెన్నై లోను 50 థియేటర్స్ లో రిలీజైన ఈ సినిమా, ఓవర్సీస్ లో 230 కు పైగా థియేటర్స్ లో విడుదలైంది. పవన్ కళ్యాణ్ కరియర్ లోనే అత్యధిక స్క్రీన్స్ లో రిలీజ్ అవుతున్న సినిమాగా కాటమరాయుడు రికార్డు సృష్టించింది.

ఫ్యాక్షన్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ రిలీజ్ కి ముందే హై ఎండ్ హైప్ ని క్రియేట్ చేసింది. పంచె కట్టులో రాయలసీమ యాసలో ఎట్రాక్ట్ చేస్తున్న పవన్ కళ్యాణ్ సినిమాకి పెద్ద ఎట్రాక్షన్ లా నిలిచాడు.

 

శరత్ మరార్ నిర్మించిన ఈ సినిమాలో శృతి హాసన్ హీరోయిన్ గా నటించింది. తమిళ బ్లాక్స్ బస్టర్ వీరమ్ కు అన్-అఫీషియల్ రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాకి అనూప్ రూబెన్స్ మ్యూజిక్ అందించాడు.