నేను ఆరోగ్యంగా ఉన్నాను.. అందరికీ థ్యాంక్స్

Friday,July 10,2020 - 01:10 by Z_CLU

రీసెంట్ గా లివర్ ట్రాన్స్ ప్లాంటేషన్ చేయించుకున్నారు గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ. సర్జరీ సక్సెస్ పుల్ గా జరిగింది. అయితే ఆయన ఆరోగ్య పరిస్థితి మరోసారి క్రిటికల్ గా ఉందంటూ ప్రచారం మొదలైంది.

దీంతో స్వయంగా సుద్దాల సీన్ లోకి వచ్చారు. తన ఆరోగ్య పరిస్థితిపై ఓ వీడియో విడుదల చేశారు. తను బాగానే ఉన్నానని ప్రకటించారు.

“మీ అందరి ప్రేమ, దయ వల్ల.. ప్రభుత్వ సహాయసహకారాల వల్ల నేను మెల్లమెల్లగా కోలుకుంటున్నాను. మళ్లీ పాటలు రాస్తున్నాను. నేను చాలా ఆరోగ్యంగా, సంతోషంగా ఉన్నాను. కాకపోతే కరోనా వల్ల బయటకు రావడం లేదంతే. అంతేతప్ప, నా ఆరోగ్యంలో ఎలాంటి ఇబ్బంది లేదు.”

తన హెల్త్ కండిషన్ పై వస్తున్న పుకార్లను నమ్మొద్దంటున్నారు అశోక్ తేజ. ఎప్పట్లానే మరిన్ని పాటలు రాస్తానని అంటున్నారు.