రాథేశ్యామ్ ఫస్ట్ లుక్ వచ్చేసింది

Friday,July 10,2020 - 11:41 by Z_CLU

అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రభాస్ మూవీ ఫస్ట్ లుక్ రానే వచ్చింది. ఈరోజు ఉదయం సరిగ్గా 10 గంటలకు ప్రభాస్ మూవీ టైటిల్ తో పాటు ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు.

ప్రభాస్-పూజా హెగ్డే హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు రాథేశ్యామ్ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఫస్ట్ లుక్ కింద హీరోహీరోయిన్లు డాన్స్ చేస్తున్న రొమాంటిక్ స్టిల్ ను రిలీజ్ చేశారు.

ఇదొక క్లాస్ మూవీ. పీరియాడిక్ లవ్ స్టోరీ. ఇప్పటివరకు తెలుగు సిల్వర్ స్క్రీన్ పై చూడని కథ. ఆ ఫీల్, థీమ్ క్యారీ చేసే విధంగా ఫస్ట్ లుక్ ను క్లాసీగా డిజైన్ చేశారు. ప్రభాస్-పూజా పెయిర్ అయితే అదిరిపోయింది.

ముందుగా ఈ సినిమాకు జాన్ అనే టైటిల్ అనుకున్నారు. కానీ దాదాపు అదే పేరుతో జాను అనే టైటిల్ తో సినిమా వచ్చేసింది. అందుకే రాథేశ్యామ్ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు.

యూవీ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కుతున్న ఈ సినిమాకు రాథాకృష్ణ కుమార్ దర్శకుడు. రెబల్ స్టార్ కృష్ణంరాజు ప్రజెంటర్ గా వ్యవహరిస్తున్నారు. వచ్చే ఏడాది థియేటర్లలోకి రాబోతోంది రాథేశ్యామ్.