అతిలోక సుందరి 300 వ సినిమా

Wednesday,March 15,2017 - 01:04 by Z_CLU

అతిలోక సుందరి 300వ సినిమా ఫస్ట్ లుక్ రిలీజైంది. ఇంగ్లీష్ వింగ్లిష్ సినిమాతో సెకండ్ ఇన్నింగ్స్ బిగిన్ చేసిన శ్రీదేవి ఆ తరవాత ‘పులి’ సినిమాలో క్రూషల్ రోల్ పోషించింది. మళ్ళీ ఇన్నాళ్ళకు తన నెక్స్ట్ వెంచర్ ‘Mom’ తో సరికొత్తగా తన మార్క్ ఎంటర్ టైనర్ తో రెడీ అయిపోతుంది.

రీసెంట్ గా జరిగిన Zee Cine అవార్డ్స్ లో దాదాపు 170 దేశాల్లో కొన్ని బిలియన్ల మంది ప్రేక్షకులు చూస్తుండగా శ్రీదేవి కూతుళ్ళు ఖుషి కపూర్, జాహ్నవి కపూర్  చేతుల మీదుగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ‘Mom’ ఫస్ట్ లుక్ లాంచ్ జరిగింది.

 

రవి ఉదయ్ వార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాని బోణీ కపూర్ నిర్మిస్తున్నారు. జూలై 14, 2017 రిలీజ్  డేట్ ని ఫిక్స్ చేసుకున్న ఈ సినిమా తెలుగు, తమిళ, హిందీ భాషల్లో ఒకేసారి రిలీజ్ చేసే ఆలోచనలో ఉంది సినిమా యూనిట్.