బాలయ్య కోసం కొత్త హీరోయిన్

Wednesday,March 15,2017 - 12:00 by Z_CLU

నందమూరి బాలకృష్ణ పూరి జగన్నాథ్ కాంబోలో తెరకెక్కనున్న సినిమా ఇటీవలే పూజ కార్యక్రమాలతో ప్రారంభమైన సంగతి తెలిసిందే.. అయితే ఈ సినిమాలో ఆర్టిస్టులెవరు.. టెక్నీషియన్స్ ఎవరెవరు పని చేయబోతున్నారు అనే డీటెయిల్స్ మాత్రం ఇంకా అనౌన్స్ చేయకుండా సస్పెన్స్ మెయింటైన్ చేస్తున్నాడు పూరి.

ఇప్పటికే ఈ సినిమా కోసం కొంతమంది టెక్నీషియన్స్ ను ఫైనల్ చేశారని టాక్ వినిపిస్తుండగా.. మరోవైపు బాలయ్య కోసం పూరి కొత్త హీరోయిన్ వేటలో పడ్డాడనే వార్త కూడా చక్కర్లు కొడుతుంది.. ప్రస్తుతం బాలయ్య కి హీరోయిన్ ని ఫైనల్ చేసే పనిలో ఉన్న పూరి.. వీలైనంత వరకూ ఫ్రెష్ కాంబోను సెట్ చేయాలనీ చూస్తున్నాడట. ఇందులో భాగంగా కొంతమంది బాలీవుడ్ హీరోయిన్ల పేర్లను ఫైనలైజ్ చేసినట్టు తెలుస్తోంది. వీళ్లతో పాటు మరో ఇద్దరు కొత్తమ్మాయిల ప్రొఫైల్స్ కూడా పూరి వద్ద సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది. త్వరలోనే నటసింహం సరసన నటించే హీరోయిన్ ఎవరనే విషయంపై క్లారిటీ వచ్చేస్తుంది