నాగార్జున రాజుగారి గది 2 అప్ డేట్స్

Wednesday,March 15,2017 - 02:08 by Z_CLU

నాగార్జున రాజుగారి గది 2 పాండిచ్చేరి షెడ్యూల్ కి అంతా సెట్ అయిపోయింది. అల్టిమేట్ హారర్ థ్రిల్లర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమా మార్చి 18 నుండి పాండిచ్చేరిలో రెగ్యులర్ షూటింగ్ జరుపుకోనుంది.

ఓంకార్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సమంతా ఓ కీ రోల్ పోషిస్తున్న విషయం తెలిసిందే. నాగ్ కరియర్ లో ఫస్ట్ టైం హారర్ జోనర్ లో చేస్తున్న సినిమా కావడంతో న్యాచురల్ గానే ఫ్యాన్స్ లో హై ఎండ్ ఎక్స్ పెక్టేషన్స్ క్రియేట్ అయ్యాయి.

 

 

నాగ సరసన సీరత్ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో రాజుగారి గది లో హీరోగా నటించిన ‘ఓంకార్’ తమ్ముడు అశ్విన్ కూడా ఒక స్పెషల్ క్యారెక్టర్ లో నటిస్తున్నాడు. హారర్ తో పాటు బోలెడన్ని ఎంటర్ టైన్ మెంట్ ఎలిమెంట్స్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫాస్ట్  పేజ్ లో షూటింగ్ జరుపుకునే పనిలో ఉంది.