SreeVishnu సూపర్ హిట్ కాంబో రిపీట్

Thursday,May 05,2022 - 04:35 by Z_CLU

Sree Vishnu plays three different roles in his next with Hasith Goli !

‘రాజ రాజ చోర’ తో సూపర్ హిట్ అందుకున్న హీరో శ్రీ విష్ణు దర్శకుడు హసిత్ గోలి కలిసి మరో సినిమా చేయబోతున్నారు. తాజాగా స్క్రిప్ట్ లాక్ చేసుకున్న ఈ సినిమాకు సంబంధించి ప్రీ ప్రొడక్షన్ వర్క్ మొదలైంది. త్వరలోనే సెట్స్ వెళ్లేందుకు రెడీ అవుతున్నారు టీం. అయితే ఈ సినిమాలో ఇప్పటి వరకూ చేయని మూడు విభిన్న పాత్రల్లో కనిపించబోతున్నాడట శ్రీ విష్ణు. ఈ విషయాన్ని తనే స్వయంగా చెప్పుకున్నాడు. అయితే ఆ పాత్రలు ఎలా ఉంటాయనేది మాత్రం చెప్పలేదు.

మొదటి సినిమాతోనే సక్సెస్ ఫుల్ రైటర్ కం డైరెక్టర్ అనిపించుకున్నాడు హసిత్ గోలి. ‘రాజ రాజ చోర’లో కామెడీ సీన్స్ బాగా రాసుకొని అవి థియేటర్స్ లో పేలేలా చూసుకున్నాడు. ఇప్పుడు రెండో సినిమాను కూడా అదే హీరోతో చేయబోతున్నాడు. మరి ఇందులో శ్రీ విష్ణుని మూడు పాత్రల్లో చూపిస్తూ హసిత్ ఎలా ఎంటర్టైన్ చేస్తాడా అనేది ఆసక్తి రేకెత్తిస్తుంది.

ఒక సక్సెస్ ఫుల్ కాంబో రిపీట్ అయితే ఆ సినిమా మీద ఆటోమేటిక్ గా బజ్ క్రియేట్ అవుతుంది. ఈ ప్రాజెక్ట్ మీద కూడా ఇప్పటి నుండి ఎక్స్ పెక్టేషన్స్ నెలకొంటున్నాయి. మైత్రి మూవీ మేకర్స్ బేనర్ పై నవీన్ యర్నేని , రవి శంకర్ నిర్మించనున్న ఈ సినిమాను త్వరలోనే ఎనౌన్స్ చేయబోతున్నారు. ప్రస్తుతం శ్రీ విష్ణు ‘అల్లూరి’ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. ఆ సినిమా పూర్తవ్వగానే హసిత్ తో సినిమాను స్టార్ట్ చేసే ప్లానింగ్ లో ఉన్నాడు. ఈ లోపు హసిత్ ప్రీ ప్రొడక్షన్ వర్క్ అంతా కంప్లీట్ చేస్తాడు.

  • Follow Us for Latest Telugu Zee Cinemalu News and upcoming trending stories, Gossips, Actress Photos and Special topics