Arjuna Phalguna - శ్రీవిష్ణు ఫినిషింగ్ టచ్

Friday,December 17,2021 - 12:05 by Z_CLU

Sree Vishnu’s Arjuna Phalguna Releasing On December 31st

శ్రీవిష్ణు కొత్త సినిమా అర్జున ఫాల్గుణ. మ్యాట్నీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై డిఫరెంట్ కాన్సెప్ట్ తో వస్తోంది ఈ సినిమా. ఇప్పుడీ సినిమాకు రిలీజ్ డేట్ ఫిక్స్ చేశారు. ఈ ఏడాదికి ఫినిషింగ్ టచ్ ఇస్తూ, డిసెంబర్ 31న థియేటర్లలోకి వస్తున్నాడు అర్జున ఫాల్గుణ.

నూతన సంవత్సరం సందర్బంగా మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ సంస్థ ఈ ఎంటర్‌టైన్‌మెంట్ చిత్రాన్ని అందించేందుకు సిద్దమైంది. ఈ మేరకు విడుదల చేసిన పోస్టర్‌లో శ్రీవిష్ణు, అమృతా అయ్యర్‌లతో పాటు మిగిలిన నటీనటులు కనిపిస్తున్నారు. రిలీజ్ డేట్ ప్రకటించడంతో మూవీ యూనిట్ ప్రమోషన్స్‌లో వేగం పెంచింది.

ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర టీజర్‌కి అద్భుతమైన స్పందన లభించింది. ప్రియదర్శన్ బాలసుబ్రమణియన్ స్వరపరిచిన పాటలు కూడా ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. నిరంజన్ రెడ్డి, అన్వేష్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాతో తేజ మర్ని దర్శకుడిగా పరిచయమౌతున్నాడు. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే కూడా ఇతడే.