Prabhas Radheshyam - ప్రీ రిలీజ్ ఈవెంట్ అక్కడే?

Friday,December 17,2021 - 09:55 by Z_CLU

Prabhas Radheshyam Pre Release event details

పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ అప్ కమింగ్ సినిమా ‘రాధేశ్యామ్’ వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలిచిన సంగతి తెలిసిందే. జనవరి 14న పొంగల్ స్పెషల్ గా రిలీజ్ అవుతున్న ఈ భారీ బడ్జెట్ సినిమాకు సంబంధించి భారీ ప్రమోషన్స్ తో రెడీ అవుతున్నారు మేకర్స్. ఇప్పటికే ఒక్కో సాంగ్ ని రిలీజ్ చేస్తూ మిలియన్ వ్యూస్ కొల్లగొడుతున్న ఈ సినిమాకు సంబంధించి భారీ ఎత్తున ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేయబోతున్నారు.

ప్రభాస్ అభిమానులు భారీగా తరలివచ్చేలా భారీ లెవెల్ లో ఈవెంట్ చేయబోతున్నారు. డిసెంబర్ 23న రామోజీ ఫిలిం సిటీ ఈవెంట్ చేయబోతున్నట్లు సమాచారం. గతంలో ప్రభాస్ ‘బాహుబలి’ ఈవెంట్ ను కూడా అక్కడే ఏర్పాటు చేశారు. ఆ ఈవెంట్ గ్రాండ్ సక్సెస్ అయింది. ఎంత మంది అభిమానులు వచ్చినా సరిపడే స్థలం కావడంతో ఈసారి కూడా ప్రభాస్ ఈవెంట్ అక్కడే ప్లాన్ చేస్తున్నారట. ఈవెంట్ కి రాజమౌళితో మరికొందరు సినీ ప్రముఖులు గెస్ట్ లుగా హాజరు కానున్నారు.

సినిమా రిలీజ్ కి ఇంకా సరిగ్గా నెల రోజులే ఉండటంతో మిగతా భాషల్లో కూడా ప్రెస్ మీట్ లు ఏర్పాటు చేసే ప్లానింగ్ ఉన్నారు మేకర్స్. ఇక్కడ ప్రీ రిలీజ్ ఈవెంట్ అయిన వెంటనే ముంబైలో ప్రమోషన్స్ మొదలు పెడతారు. అక్కడ కొన్ని డిఫరెంట్ ప్రమోషన్స్ ప్లాన్ చేస్తుంది యూనిట్. ప్రభాస్ నటించిన ప్రీవియస్ ఫిలిం ‘సాహో’ నార్త్ లో భారీ కలెక్షన్స్ రాబట్టిన సంగతి తెలిసిందే. అందుకే ఈసారి కూడా ఆ రేంజ్ కలెక్షన్స్ అందుకోవడానికి మేకర్స్ ముంబైలో భారీగా ప్రమోషన్స్ ప్లాన్ చేసుకుంటున్నారు. మరికొన్ని రోజుల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సంబంధించి అధికారిక ప్రకటన రానుంది.