సోషల్ మీడియాలో స్పైడర్ సంచలనాలు

Friday,August 04,2017 - 03:01 by Z_CLU

విడుదలై పట్టుమరి 2 రోజులు కూడా కాలేదు. ఈ షార్ట్ గ్యాప్ లోనే సోషల్ మీడియా రికార్డుల్ని చెల్లాచెదురు చేసింది స్పైడర్ మూవీ. మహేష్-మురుగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించి ఈనెల 2న ఓ సాంగ్ రిలీజ్ చేశారు. ఆ సింగిల్ ఇప్పుడు యూట్యూబ్ లో హల్ చల్ చేస్తోంది. షార్ట్ గ్యాప్ లో 2 మిలియన్ వ్యూస్ సంపాదించింది ‘బూమ్ బూమ్’ అనే సింగిల్.

ప్రస్తుతం ఈ సాంగ్ అన్ని సామాజిక మాధ్యమాల్లో టాప్ ట్రెండింగ్స్ లో కొనసాగుతోంది. యూట్యూబ్, ట్విట్టర్, సావన్, ఫేస్ బుక్.. ఇలా ప్రతి వేదికపై బూమ్ బూమ్ సాంగ్ దే ఫస్ట్ ప్లేస్. ఈ సినిమాకు హరీష్ జైరాజ్ మ్యూజిక్ అందించగా.. ఈ సాంగ్ ను నికితా గాంధీ ఆలపించారు. సినిమా మోస్ట్ స్టయిలిష్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతుందనే విషయం ఈ సాంగ్ చూస్తేనే అర్థమైపోతుంది.

మహేష్-రకుల్ హీరోహీరోయిన్లుగా వస్తున్న ఈ సినిమా దసరా కానుకగా సెప్టెంబర్ 27న ప్రపంచవ్యాప్తంగా విడుదలకానుంది. ఏఆర్ మురుగదాస్ ఈ సినిమాకు దర్శకుడు.