ఆగస్ట్ 7న ఏంజెల్ సినిమా ట్రయిలర్

Friday,August 04,2017 - 03:50 by Z_CLU

శ్రీ సరస్వతి ఫిల్మ్స్ బ్యానర్ పై నాగ్ అన్వేష్, హెబ్బా పటేల్ జంటగా నటించిన చిత్రం ‘ఏంజెల్’. సోషియో ఫాంటసీ స్టోరీతో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రానికి రాజమౌళి శిష్యుడు పళని దర్శకత్వం వహించాడు. ఈనెల 7 నుంచి ఈ సినిమా ప్రమోషన్ ను అఫీషియల్ గా స్టార్ట్ చేయబోతున్నారు. ఆరోజున సినిమా థియేట్రికల్ ట్రయిలర్ ను విడదుల చేయబోతున్నారు.

దాదాపు 40 నిమషాలకి పైగా గ్రాఫిక్స్ హంగులతో రెడీ అయింది ఈ సినిమా. తెలుగుతో పాటు తమిళ, హిందీ భాషల్లోకి విడుదల చేయబోతున్నారు ఏంజెల్ సినిమాని. ప్రస్తుతం విజువల్ ఎఫెక్ట్స్ వర్క్స్ లో బిజీగా ఉన్న ఈ సినిమాను అతి త్వరలో విడుదల చేసేందుకు సన్నాహలు చేస్తున్నట్లుగా దర్శకనిర్మాతలు ప్రకటించారు.

సుమన్, సప్తగిరి, కబీర్ ఖాన్, ప్రదీప్ రావత్, షియాజీ షిండే, ప్రియదర్శీ, ప్రభాస్ శ్రీను, సన ముఖ్యపాత్రలు పోషించిన ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందించాడు. భువన్ సాగర్ నిర్మించిన ఏంజెల్ మూవీకి గుణ సినిమాటోగ్రాఫర్.