స్పైడర్ క్రేజ్ ను డబుల్ చేసిన సెన్సార్ రిపోర్ట్

Tuesday,September 19,2017 - 02:06 by Z_CLU

మహేష్ బాబు స్పైడర్ సెన్సార్ ఫార్మాలిటీస్ కంప్లీట్ చేసుకుని ఒక్క కట్ కూడా లేకుండా U/A సర్టిఫికేట్ పొందింది. సెన్సార్ బోర్డు సభ్యులు కొంతమంది నుంచి ఈ సినిమాపై ఫీడ్ బ్యాక్ వచ్చింది. మహేష్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా స్పైడర్ నిలుస్తుందని కొంతమంది సెన్సార్ సభ్యులు అభిప్రాయపడ్డారు.

యూకే/యూఏఈ సెన్సార్ బోర్డులో సభ్యుడిగా ఉన్న ఉమైర్ సంధు.. స్పైడర్ సినిమాకు సంబంధించి క్రేజీ అప్ డేట్స్ అందించాడు. ఎక్కడా డల్ మూమెంట్ అనేదే లేకుండా పక్కా స్క్రీన్ ప్లే తో స్పైడర్ తెరకెక్కినట్టు ఉమైర్ ట్వీట్ చేశాడు. సెన్సార్ బోర్డు సభ్యులతో రెగ్యులర్ గా టచ్ లో ఉండే ఈ క్రిటిక్.. స్పైడర్ సినిమా మహేష్ బాబు కరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలుస్తుందని అంటున్నాడు.

ఒక్క కట్ కూడా లేకుండా సెన్సార్ పూర్తిచేసుకున్న స్పైడర్ ను సభ్యులు ప్రత్యేకంగా మెచ్చుకున్నారు. మరీ ముఖ్యంగా మద్యపానం, ధూమపానం ఆరోగ్యానికి ప్రమాదకరం లాంటి సందేశాలు సినిమాలో ఎక్కడా వేయాల్సిన అవసరం కూడా లేకుండా.. కుటంబమంతా కలిసి చూసే విధంగా స్పైడర్ తెరకెక్కింది. కేవలం ఇందులో ఉన్న యాక్షన్ మోతాదును దృష్టిలో పెట్టుకొని మాత్రమే U/A సర్టిఫికేట్ ఇచ్చామంటున్నారు సెన్సార్ సభ్యులు.