Pawan Birthday - రేపటి ఎట్రాక్షన్ ఇవే

Tuesday,September 01,2020 - 06:42 by Z_CLU

రేపు పవర్ స్టార్ పవన్ కల్యాణ్ పుట్టినరోజు. అభిమానులకు పండగ రోజు. అయితే ఎన్నడూ లేని విధంగా ఈసారి Pawan Kalyan Birthday కి చాలా హంగామా ఉంది. ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 3 సినిమాల నుంచి సర్ ప్రైజెస్ రాబోతున్నాయి.

ముందుగా వకీల్ సాబ్ నుంచి సర్ ప్రైజ్ ఉంది. రేపు ఉదయం 9 గంటల 9 నిమిషాలకు.. VakeelSaab మోషన్ టీజర్ రిలీజ్ చేయబోతున్నారు. దీని కోసం ఎప్పట్నుంచో పవన్ అభిమానులు వెయిటింగ్.

ఇక వకీల్ సాబ్ మోషన్ టీజర్ రిలీజైన కొద్దిసేపటికే Pawan-Krish మూవీ అప్ డేట్ రాబోతోంది. ఈ సినిమా ఆగిపోయిందంటూ జరుగుతున్న ప్రచారానికి చెక్ పెడుతూ.. రేపు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో #PSPK27 కు సంబంధించి అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ ఇవ్వబోతున్నారు.

ఇక సాయంత్రం 4 గంటలకు.. Pawan-Harish Shankar మూవీని అధికారికంగా ప్రకటించబోతున్నారు. ఈ మేరకు మైత్రీ మూవీ మేకర్స్ నుంచి ప్రకటన రాబోతోంది. గబ్బర్ సింగ్ తర్వాత పవన్-హరీష్ కాంబోలో రాబోతున్న సినిమా ఇది.