పవన్ కల్యాణ్ కోసం భారీ సెట్లు

Thursday,January 30,2020 - 03:48 by Z_CLU

పవన్ నటిస్తున్న పింక్ రీమేక్ కోసం ఇప్పటికే అన్నపూర్ణ స్టుడియోస్ లో భారీ సెట్ వేశారు. ఇప్పుడు పవన్-క్రిష్ మూవీ కోసం కూడా భారీ సెట్స్ నిర్మాణం జరుగుతోంది. రామోజీ ఫిలింసిటీతో పాటు హైదరాబాద్ చుట్టుపక్కల దాదాపు 20 కోట్ల రూపాయల ఖర్చుతో ఈ సెట్స్ నిర్మిస్తున్నారు

పీరియాడిక్ మూవీగా వస్తోంది పవన్-క్రిష్ సినిమా. ఇందులో రాబిన్ హుడ్ టైపు క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు పవన్. సో.. ఇలాంటి సినిమాకు సెట్స్ తప్పనిసరి. పైగా ఔట్-డోర్ షూటింగ్స్ పెట్టుకుంటే ఫ్యాన్స్ కారణంగా సకాలంలో షూటింగ్స్ కావడం లేదు. పైగా లీకుల గోల ఉండనే ఉంది. పింక్ రీమేక్ కు సంబంధించి ఆల్రెడీ వీడియో లీకైన
సంగతి తెలిసిందే.

అందుకే క్రిష్ సినిమాను కూడా మ్యాగ్జిమమ్ సెట్స్ లోనే షూట్ చేయాలని ఫిక్స్ అయ్యారు. ఫిబ్రవరి 4 నుంచి ఈ సినిమా సెట్స్ పైకి వస్తుంది. కీరవాణి సంగీతం అందించనున్న ఈ సినిమాను ఏఎం రత్నం నిర్మిస్తున్నాడు. హీరోయిన్ ను ఇంకా ఫిక్స్ చేయలేదు.