నాకు అంత రేంజ్ లేదు..

Wednesday,November 09,2016 - 10:15 by Z_CLU

కొన్ని విషయాల్ని ఓపెన్ గా ఒప్పుకోవడానికి చాలామంది ఇష్టపడరు. మరీ ముఖ్యంగా సినీఫీల్డ్ లో ఈ రకం చాలామంది. నెగెటివ్స్ ఒప్పుకుంటే ఎక్కడ చులకన అయిపోతామా అనే భయం హీరోల్లో ఎక్కువగా కనిపిస్తుంది. అందుకే చాలా అంశాల్ని స్కిప్ చేస్తుంటారు. కానీ నాగచైతన్య మాత్రం ఓ విషయాన్ని ఓపెన్ గా ఒప్పుకున్నాడు. తనకు అంత రేంజ్ లేదని చెప్పేశాడు.

ప్రస్తుతం రీమేక్ లతో విజయాలు అందుకుంటున్న నాగచైతన్య ఇటీవలే మలయాళం లో గ్రాండ్ హిట్ సాధించిన ‘ప్రేమమ్’ సినిమా రీమేక్ తో మరో సక్సెస్ కొట్టాడు. ఇదే ఊపులో అతడు మరో రీమేక్ లో కూడా నటిస్తాడంటూ వార్తలు వస్తున్నాయి. గతంలో నాగ్ నటించిన హలో బ్రదర్ సినిమాను చైతూ రీమేక్ చేస్తాడంటూ ప్రచారం జరుగుతోంది.
naga-chaitu-feature-image
హలో బ్రదర్ రీమేక్ కు సంబంధించి రూమర్స్ వచ్చిన వెంటనే చైతూ రియాక్ట్ అయ్యాడు. తనకు అంత సీన్ లేదని ఓపెన్ గానే ఒప్పుకున్నాడు. ఆ సినిమా  రీమేక్ చేద్దామ‌నుకున్నాం కానీ చివ‌ర‌కు ‘హ‌లో బ్ర‌ద‌ర్’ సినిమా క్లాసిక్ కావ‌డం, ఆ రేంజ్‌లో తను నటించలేనని చైతూ ఒప్పుకున్నాడు. చైతూలా ఎంతమంది హీరోలు ఇలా ఓపెన్ గా ఒప్పుకుంటారు చెప్పండి…