మరో ప్రయోగం

Wednesday,October 12,2016 - 12:40 by Z_CLU

శ్రీరస్తు శుభమస్తు సినిమా సక్సెస్ తో కమర్షియల్ హీరోల లిస్ట్ లో చేరిపోయిన అల్లు శిరీష్.. తన నెక్ట్స్ సినిమాని వి. ఆనంద్ దర్శకత్వంలో చేయనున్నట్లు ఎనౌన్స్ చేసేశాడు. తమిళ సినిమా ‘అప్పుచి గ్రామం’ తో దర్శకుడిగా తెరంగేట్రం చేసిన VI.ఆనంద్, గతంలో సందీప్ కిషన్ ‘టైగర్’ కి దర్శకత్వం వహించాడు. ఇప్పుడు నిఖిల్ హీరోగా ‘ఎక్కడికి పోతావు చిన్నవాడా’ సినిమాని తెరకెక్కించే పనిలో ఉన్నాడు.

cueh52lvmaile6o0

శ్రీరస్తు శుభమస్తు లాంటి సినిమాలో లవర్ బాయ్ గా మంచి మార్కులను కొట్టేసిన ఈ అల్లు వారబ్బాయి, ఈ సారి సైన్స్ ఫిక్షన్ కథాంశంతో ప్రయోగం చేయనున్నాడు. థ్రిల్లింగ్ కథాంశంతో తెరకెక్కనున్న ఈ సినిమాకి సంబంధించి ఇంకా డీటేల్స్ తెలియాల్సి ఉంది.