మరో కొత్త బంధం

Wednesday,October 12,2016 - 11:56 by Z_CLU

టాలీవుడ్ లో కొత్త కొత్త బంధాలు తెరపైకి వస్తున్నాయి. ఒకప్పటిలా ఒక సినిమాకి పని చేసి ప్యాకప్ అవ్వగానే బై బై చెప్పుకోవడం లాంటివి కాకుండా స్టార్స్ తమ కో-స్టార్స్ తో తెరవెనక కూడా అంతే అన్యోన్యంగా ఉంటున్నారు. ఈ విషయంలో రానా ఎప్పుడూ ముందుంటాడు. ఆఫ్-స్క్రీన్ లో కూడా సహనటీనటులతో మంచి రిలేషన్ షిప్ మెయింటైన్ చేస్తుంటాడు. దానికి ఎగ్జాంపులే ఈ ఫొటో.

rana-kajal

ఈ ఫొటోలో ఒక చేయి రానాది అయితే, మరో చేయి కాజల్ ది. ఇలా వీళ్లిద్దరూ తమ చేతికున్న బ్యాండ్స్ ను చూపిస్తూ ఓ ఫొటో తీసుకున్నారు. ఆ ఫోటోను రానా సోషన్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇదిగో నా సూపర్ స్టార్   కో-స్టార్ అంటూ కాజల్ ను పరిచయం చేశాడు. తేజ దర్శకత్వంలో వీళ్లిద్దరూ కలిసి ఓ సినిమాకు సైన్ చేశారు.