జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన సిద్ధార్థ్ ట్రయిలర్

Wednesday,October 11,2017 - 11:47 by Z_CLU

ఈమధ్య కాలంలో కనిపించి చాలా రోజులైంది. ఆ మధ్య చేసిన సినిమాలు వరుసగా ఫ్లాపులయ్యాయి. అందుకే హీరో సిద్దార్థ్ గ్యాప్ తీసుకున్నాడు. అలా స్మాల్ గ్యాప్ తర్వాత గృహం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాడు. ఇదొక కంప్లీట్ హారర్ సినిమా. అది కూడా అలాంటిలాంటి హారర్ కాదు. ట్రయిలర్ తోనే అందర్నీ భయపెట్టేస్తోంది.

అవును.. తాజాగా విడుదలైన గృహం ట్రయిలర్ భయపెడుతూనే అందర్నీ ఎట్రాక్ట్ చేస్తోంది. విడుదలైన కొన్ని గంటల్లోనే ఈ ట్రయిలర్ కు లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి. “ఇందులో సన్నివేశాలు మిమ్మల్ని చాలా భయపెడతాయి. రిస్క్ చేయాలనుకుంటే చూడండి.” అంటూ ట్రయిలర్ స్టార్టింగ్ లోనే వార్నింగ్ ఇచ్చారంటే గృహం ఎంత భయపెడుతుందో అర్థం చేసుకోవచ్చు. నేషనల్ లెవెల్లో ఈ సినిమా ట్రయిలర్ కు క్రేజ్ వచ్చింది.

హారర్ సినిమాల్ని ఇష్టపడే ప్రేక్షకులకు మోస్ట్ ప్రామిసింగ్ మూవీగా వస్తోంది గృహం. ఈ జానర్ లో సిద్ధూ చేసిన ఫస్ట్ సినిమా ఇదే. ఇటాకీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై వయోకమ్-18 ప్రొడక్షన్స్ సమర్పిస్తున్న ఈ సినిమాకు మిలింద్ దర్శకుడు. ఈ సినిమాలో నటించడమే కాకుండా.. కథా సహకారం కూడా అందించాడు సిద్దార్థ్.

మ్యూజిక్ డైరక్టర్ గిరీష్, సినిమాటోగ్రాఫర్ శ్రేయాష్ క్రిష్ణ, ఆర్ట్ డైరక్టర్ శివశంకర్, సౌండ్ డిజైనర్ విష్ణు గోవింద్ గురించి ఇక్కడ ప్రత్యేకంగా చెప్పుకోవాలి. వీళ్ల వర్క్ ట్రయిలర్ లో మెయిన్ ఎట్రాక్షన్ గా నిలిచింది.