సుశాంత్ కొత్త సినిమా పేరు చి.ల.సౌ

Wednesday,October 11,2017 - 12:08 by Z_CLU

నటుడు రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా మారి ఓ సినిమా చేయబోతున్నాడనే విషయం అందరికీ తెలిసిందే. ఆ సినిమానే ఈరోజు లాంఛనంగా ప్రారంభమైంది. రాహుల్ రవీంద్రన్ దర్శకుడిగా, అక్కినేని హీరో సుశాంత్ హీరోగా కొత్త సినిమా స్టార్ట్ అయింది. రామానాయుడు స్టుడియోస్ లో లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమాకు చి.ల.సౌ అనే ఇంట్రెస్టింగ్ టైటిల్ పెట్టారు. చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి అనే దీవెనకు షార్ట్ కట్ ఈ చి.ల.సౌ.

టైటిల్ చూస్తేనే ఇదొక ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అనే విషయం అర్థమౌతుంది. మరీ ముఖ్యంగా పెళ్లి చుట్టూ తిరిగే కథతో ఇది తెరకెక్కనుందనే విషయం కూడా తెలుస్తోంది. టైటిల్ డిజైనింగ్ లో కూడా ఇవే ఎలిమెంట్స్ ను పొందుపరిచారు. సినిమాలో సుశాంత్ తో పాటు వెన్నెల కిషోర్ ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతున్నాడు.