సింపుల్ గా శ్రియ పెళ్లి

Tuesday,March 20,2018 - 11:10 by Z_CLU

హీరోయిన్ శ్రియ పెళ్లి తంతు పూర్తయింది. రష్యాకు చెందిన వ్యాపారవేత్త ఆండ్రీ కుశ్చేవ్ తో హిందూ సంప్రదాయంలో శ్రియ పెళ్లి జరిగింది. అయితే తెలుగులో ఉన్నన్ని మలుపులు ఈమె పెళ్లిలో కూడా ఉన్నాయి.

మార్చి 17, 18, 19 తేదీల్లో వరుసగా 3 రోజుల పాటు శ్రియ పెళ్లి గ్రాండ్ గా జరుగుతుందని వార్తలొచ్చాయి. అయితే వీటికి భిన్నంగా అత్యంత సాధారణంగా సింపుల్ గా శ్రియ-కుశ్చేవ్ పెళ్లి చేసుకున్నారు. ఇక గతంలో చెప్పుకున్నట్టు 18వ తేదీన కాకుండా.. 12వ తేదీనే వీళ్లిద్దరి పెళ్లి తంతు పూర్తయింది.

కేవలం శ్రియ, కుశ్చేవ్ బంధువులు, వాళ్ల స్నేహితులు మాత్రమే ఈ పెళ్లికి వెళ్లారు. ఇంకా చెప్పాలంటే మొత్తంగా 50 మంది కూడా లేరు. పెళ్లి తర్వాత బాలీవుడ్ ప్రముఖులకు రిసెప్షన్ ఇస్తుందనుకుంటే ఆ పని కూడా చేయలేదు శ్రియ. ప్రస్తుతం శ్రియ, కుశ్చేవ్ హనీమూన్ లో ఉన్నారు.