జీ సినిమాలు ( 20th మార్చి )

Monday,March 19,2018 - 10:02 by Z_CLU

గోల్కొండ హై స్కూల్

నటీనటులు : సుమంత్, స్వాతి

ఇతర నటీనటులు : సుబ్బరాజు, తనికెళ్ళ భరణి ,షఫీ ,విద్య సాగర్

మ్యూజిక్ డైరెక్టర్ : కళ్యాణి మాలిక్

డైరెక్టర్ : ఇంద్రగంటి మోహన కృష్ణ

ప్రొడ్యూసర్ : రామ్ మోహన్

రిలీజ్ డేట్ : 14  జనవరి 2011

ఓ గ్రౌండ్ దక్కించుకోవాలని ఓ స్కూల్ విద్యార్థులు చేసే ప్రయత్నం ఆధారంగా క్రికెట్ ఆట తో ఆటలు మా హక్కు అనే నినాదం తో  రూపొందిన సినిమా ‘గోల్కొండ హై స్కూల్’. సుమంత్ ను డిఫరెంట్ క్యారెక్టర్ లో చూపిస్తూ స్కూల్ పిలల్లతో  ఫుల్లెన్త్ ఎంటర్టైనర్ గా దర్శకుడు ఇంద్ర గంటి మోహన కృష్ణ తెరకెక్కించిన ఈ సినిమా అందరినీ ఆకట్టుకుంటూ అలరిస్తుంది. కళ్యాణ్ మాలిక్ పాటలు ఈ సినిమాకు మరో ప్లస్ పాయింట్.

==============================================================================

రారాజు 

నటీనటులు : గోపీచంద్, మీరా జాస్మిన్

ఇతర నటీనటులు : అంకిత, శివాజీ, ఆశిష్ విద్యార్థి, జయ ప్రకాష్ రెడ్డి, చంద్ర మోహన్

మ్యూజిక్ డైరెక్టర్ : మణిశర్మ

డైరెక్టర్ : ఉదయ శంకర్

ప్రొడ్యూసర్ : G.V.G. రాజు

రిలీజ్ డేట్ : 20 అక్టోబర్ 2006

గోపీచంద్ హీరోగా ఉదయ్ శంకర్ డైరెక్షన్ లో తెరకెక్కింది రారాజు. అతి సున్నితమైన లవ్ స్టోరి కి  మాస్ ఎలిమెంట్స్ జోడించి ఇంటరెస్టింగ్ గా తెరకెక్కించాడు. ఈ సినిమాలో కలెక్టర్ కావాలని కలలు కనే ఆంబీషియస్ అమ్మాయిగా మీరా జాస్మిన్ సరికొత్తగా కనిపిస్తుంది.  మణిశర్మ మ్యూజిక్ సినిమాకి హైలెట్.

==============================================================================

ఒక ఊరిలో

నటీనటులు : తరుణ్, రాజా, సలోని

ఇతర నటీనటులు : చంద్ర మోహన్, నరేష్, కల్పన, రామరాజు, యమునా, నిరోషా

మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీ ప్రసాద్

డైరెక్టర్ : రమేష్ వర్మ

ప్రొడ్యూసర్ : చంటి అడ్డాల

రిలీజ్ డేట్ : 1 జూలై 2005

లవర్ బాయ్ తరుణ్, తెలుగమ్మాయి సలోని జంటగా నటించిన లవ్ ఎంటర్ టైనర్ ఒక ఊరిలో. ఒక అందమైన ఊరిలో మొదలైన ప్రేమకథ ఏ మలుపు తిరిగింది. చివరికి ఏమైంది అనే కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమా మంచి ఫీల్ గుడ్ సినిమా అనిపించుకుంది. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం ఈ సినిమాకి హైలెట్.

=============================================================================

జాదూగాడు

హీరో హీరోయిన్స్ : నాగ శౌర్య, సోనారిక

ఇతర నటీ నటులు : ఆశిష్ విద్యార్థి, అజయ్, జాకీర్ ఉస్సేన్, సప్తగిరి, శ్రీనివాస్ రెడ్డి,పృద్వి రాజ్, కోట శ్రీనివాస రావు

సంగీతం :సాగర్ మహతి

నిర్మాత : వి.వి.ఎన్.ప్రసాద్

దర్శకత్వం : యోగి

అప్పటి వరకూ ప్రేమ కథా చిత్రాలతో తెలుగు ప్రేక్షకులను అలరించి లవర్ బాయ్ ఇమేజ్ సొంతం చేసుకున్న నాగ సౌర్య  పక్కా మాస్ క్యారెక్టర్ లో నటించిన  అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా ‘జాదూ గాడు’.  ఈ చిత్రం తో హీరో నాగ సౌర్య ను సరి కొత్త కోణం లో ఆవిష్కరించి అలరించాడు దర్శకుడు యోగి. యాక్షన్ సన్నివేశాలతో పాటు  కామెడీ సన్నివేశాలు, క్లైమాక్స్, సాగర్ మహతి అందించిన పాటలు హైలైట్స్.   శ్రీనివాస్ రెడ్డి. పృద్వి, రమేష్, సప్తగిరి కామెడీ సన్నివేశాలు అలరిస్తాయి. నాగ సౌర్య సరసన కథానాయికగా నటించిన సోనారిక తన గ్లామర్ తో ఆకట్టుకుంటుంది.

==============================================================================

దమ్ము

నటీనటులు : N.T.R, త్రిష కృష్ణన్, కార్తీక నాయర్

ఇతర నటీనటులు : వేణు తొట్టెంపూడి, అభినయ, భానుప్రియ, నాజర్, సుమన్, బ్రహ్మానందం, కోట శ్రీనివాస రావు, సంపత్ రాజ్, కిషోర్ తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : M.M. కీరవాణి

డైరెక్టర్ : బోయపాటి శ్రీను

ప్రొడ్యూసర్ : అలెగ్జాండర్ వల్లభ

రిలీజ్ డేట్ : 27 ఏప్రియల్ 2012

బోయపాటి శ్రీను డైరెక్షన్ లో తెరకెక్కిన అల్టిమేట్ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ దమ్ము. N.T.R స్టామినా పర్ ఫెక్ట్ గా ఎలివేట్ అయిన ఈ సినిమాకి కీరవాణి సంగీతం అందించాడు. యాక్షన్ సీక్వెన్సెస్ సినిమాకి హైలెట్ గా నిలిచాయి.

==============================================================================

 

 భాయ్

నటీనటులు : నాగార్జున, రీచా గంగోపాధ్యాయ్

ఇతర నటీనటులు : బ్రహ్మానందం, ఆశిష్ విద్యార్థి, సోను సూద్, ముకుల్  దేవ్, సాయాజీ షిండే, నాగి నీదు, ఎం.ఎస్.నారాయణ, జయప్రకాశ్ రెడ్డి, చలపతి రావు,కె.విశ్వనాధ్, ఎం.ఎస్.నారాయణ, రఘు బాబు,వెన్నెల కిషోర్,అజయ్, ఆదిత్య మీనన్,  తదితరులు

మ్యూజిక్ డైరెక్టర్ : దేవి శ్రీ ప్రసాద్

రచన, స్క్రీన్ ప్లే ,డైరెక్టర్ : వీర భద్రం చౌదరి

ప్రొడ్యూసర్ : అక్కినేని నాగార్జున

రిలీజ్ డేట్ : 25 అక్టోబర్ 2013

నాగార్జున కథానాయకుడిగా నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘భాయ్’. అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై అక్కినేని నాగార్జున నిర్మాణం లో దర్శకుడు వీరభద్రం తెరకెక్కిన ఈ చిత్రం లో భాయ్ గా నాగార్జున నటన, యాక్షన్ ఎపిసోడ్, రీచా గంగోపాధ్యాయ్ గ్లామర్,  దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ హైలైట్స్. ఈ చిత్రంలో బ్రహ్మానందం, రఘు బాబు, వెన్నెల కిషోర్ కామెడీ అలరిస్తుంది.