మహానటి షూటింగ్ పూర్తిచేసిన సమంత

Tuesday,March 20,2018 - 11:54 by Z_CLU

మేటి నటి సావిత్రి బయోపిక్ గా తెరకెక్కుతున్న మహానటి సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ మూవీకి సంబంధించి తన పార్ట్ షూట్ కంప్లీట్ చేసింది సమంత. ఆ విషయాన్ని స్వయంగా ఓ ఫొటో పోస్ట్ చేసి మరీ ట్వీట్ చేసింది. ఈ సినిమాలో జర్నలిస్ట్ పాత్రలో కనిపించబోతోంది సమంత

ఈ మూవీతో ఇదే నెలలో 3 సినిమాలు కంప్లీట్ చేసింది సమంత. కొన్ని రోజుల కిందటే రంగస్థలం సినిమా షూటింగ్ పూర్తిచేసింది. అంతకంటే ముందు ఓ తమిళ సినిమా షూట్ పూర్తిచేసింది. ఇప్పుడు మహానటి సినిమాకు కూడా ప్యాకప్ చెప్పేసింది.

మహానటి సినిమాలో కీర్తిసురేష్ లీడ్ రోల్ పోషిస్తోంది. కీలకమైన పాత్రల్లో సమంత, విజయ్ దేవరకొండ, దుల్కర్ సల్మాన్, షాలిని పాండే, మోహన్ బాబు కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ మూవీ కోసం అలనాటి క్లాసిక్ సాంగ్ వివాహ భోజనంబు పాటను, అప్పటి సెట్ ను రీక్రియేట్ చేశారు. ఇందులో ఎస్వీ రంగారావుగా మోహన్ బాబు నటించారు. మహానటి సినిమాను మే 9న విడుదల చేయబోతున్నారు.