బాహుబలి 2 రికార్డ్స్ బ్రేక్ చేసిన రజినీకాంత్ 2.0
Tuesday,November 27,2018 - 06:32 by Z_CLU
ప్రపంచ వ్యాప్తంగా వైడ్ రేంజ్ లో రిలీజైంది బాహుబలి 2. ఇండియన్ సినిమా హిస్టరీ లోనే భారీ స్థాయిలో రిలీజైన సినిమా ఇప్పటి వరకు ఇదొకటే. అయితే ఆ రికార్డ్ ని బ్రేక్ చేసింది రజినీకాంత్ 2.0. నవంబర్ 29 న రిలీజవుతున్న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఏకంగా 10,500 ల థియేటర్స్ లో రిలీజవుతుంది.
ఇండియాలో 2.0 స్క్రీన్ కౌంట్
నార్త్ ఇండియా – 5000 స్క్రీన్స్
తెలుగు రాష్ట్రాలు – 1100 స్క్రీన్స్
తమిళనాడు – 850-900 స్క్రీన్స్
కేరళ – 450 + స్క్రీన్స్
కర్నాటక – 400 స్క్రీన్స్
ఈ లెక్కన ఇండియాలో 2.0 7800 – 7850 స్క్రీన్స్ లో ప్రదర్శించబడనుంది. ఇక నార్త్ అమెరికాలో 800 స్క్రీన్స్ లో రిలీజవుతున్న 2.0., తమిళంలో 307, తెలుగు 270, హిందీ 223 స్క్రీన్స్ లో రిలీజ్ కానుంది. వీటితో పాటు కెనడా లోను 50 స్క్రీన్స్, UK లో 300 స్క్రీన్స్ లో రిలీజవుతుంది. బుకింగ్స్ ని బట్టి ఈ సంఖ్య ఇంకా పెరిగే చాన్సెస్ ఉన్నాయి.
మలేషియాలో 140 స్క్రీన్స్ లో రిలీజవుతున్న 2.0., UAE లో 700 కు పైగా స్క్రీన్స్ లో రిలీజవుతుంది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాల్లో 155 స్క్రీన్స్ లో రిలీజవుతుంది ఈ బిగ్గెస్ట్ మ్యాగ్నమ్ ఓపస్.