కరోనా ఎఫెక్ట్.. టాలీవుడ్ లో షూటింగ్స్ బంద్

Monday,March 16,2020 - 12:36 by Z_CLU

కరోనా ప్రభావంతో ఇప్పటికే చిరంజీవి లాంటి హీరోలు స్వచ్ఛంధంగా సినిమా షూటింగ్స్ నిలిపివేశారు. తమ యూనిట్ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ నిర్ణయం తీసుకుంటున్నట్టు ప్రకటించారు మెగాస్టార్. ఇలా షూటింగ్స్ కాన్సిల్ చేయడం ఇప్పుడు అఫీషియల్ అయింది. అవును.. తెలంగాణలో అన్ని ఫార్మాట్స్ లో షూటింగ్స్ నిలిపివేయాలని ప్రభుత్వం ఆర్డర్స్ పాస్ చేసింది. దీనికి తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ సపోర్ట్ చేశాయి.

తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ సంయుక్తంగా ప్రెస్ మీట్ పెట్టాయి. తెలుగు ఫిలింఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు నారాయణ దాస్ నారాంగ్, ప్రొడ్యూసర్ కౌన్సిల్ అధ్యక్షుడు సి.కళ్యాణ్, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ యాక్టింగ్ అధ్యక్షుడు బెనర్జీ కలిసి ప్రకటన చేశారు. తెలంగాణ ప్రభుత్వం నుంచి మళ్లీ ఆదేశాలు వచ్చేవరకు షూటింగ్స్ చేయమని ప్రకటించారు.

ప్రస్తుతం తెలంగాణలో జరుగుతున్న షూటింగ్స్ ఒక్కొక్కటిగా ఆగిపోతున్నాయని, అభ్యంతరం లేని ఆంధ్ర ప్రాంతాల్లో షూటింగ్స్ జరుగుతున్నాయని తెలిపిన సభ్యులు.. రాబోయే రోజుల్లో ఆంధ్ర ప్రాంతంలో కూడా షూటింగ్స్ నిలిపివేస్తామని ప్రకటించారు.

అటు ఆల్-ఇండియా ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ కూడా ఈనెల 19 నుంచి 30వ తేదీ వరకు షూటింగ్స్ నిలిపివేస్తున్నట్టు ప్రకటించింది.