మెగాస్టార్ కి జోడి ఎవరు ?

Monday,March 16,2020 - 12:11 by Z_CLU

ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్ తో షూటింగ్ కి బ్రేక్ తీసుకుంది ‘ఆచార్య’ టీం. ఇప్పటికే కొన్ని కీలక సన్నివేశాలు షూట్ చేసిన యూనిట్ త్వరలోనే స్పెషల్ రోల్ తో వచ్చే సన్నివేశాలతో పాటు అలాగే మెగా స్టార్ చిరు , హీరోయిన్ లపై కొన్ని సీన్స్ , సాంగ్స్ షూట్ చేయాలని చూస్తున్నారు. అయితే మొన్నటి వరకూ ఈ సినిమాకు హీరోయిన్ గా ఉన్న త్రిష ప్రాజెక్ట్ నుండి హఠాత్తుగా తప్పుకోవడంతో ఇప్పుడు మెగా హీరోయిన్ కోసం సెర్చ్ చేస్తున్నారు మేకర్స్.

మొన్నటి వరకూ కాజల్ ను హీరోయిన్ గా తీసుకునే ఆలోచనలో ఉన్నారన్న వార్త చక్కర్లు కొట్టగా ఇప్పుడు అనుష్క పేరు తెరపైకొచ్చింది . చిరుకి జోడిగా స్వీటీను ఫైనల్ చేసే పనిలో ఉన్నారనే టాక్ వినబడుతుంది. మరి కాజల్ , అనుష్క లో ఇద్దరిలో ఎవరు మెగా స్టార్ తో జోడీ కట్టనున్నారనేది తెలియాలంటే మరికొద్ది రోజులు ఆగాల్సిందే. అలాగే స్పెషల్ రోల్ కి అపోజిట్ హీరోయిన్ గా పూజా పేరు వినిపిస్తుంది.

మ్యాట్నీ ఎంటర్టైన్ మెంట్స్ , కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్స్ పై నిరంజన్ రెడ్డి , రామ్ చరణ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాను ఆగస్ట్ లో రిలీజ్ చేయాలని భావిస్తున్నారు.