షూటింగ్ అప్ డేట్స్

Sunday,November 03,2019 - 11:02 by Z_CLU

ప్రస్తుతం టాలీవుడ్ లో కొన్ని సినిమాలు జెట్ స్పీడులో షూటింగ్ జరుపుకుంటుండగా మరి కొన్ని సినిమాలు త్వరలోనే సెట్స్ పైకి వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. బిజీ బిజీ షెడ్యూల్స్ తో, ఇంటరెస్టింగ్ కంటెంట్ తో తెరకెక్కుతున్న సినిమాల షూటింగ్ అప్ డేట్స్ మీ కోసం.


మహేశ్ బాబు హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ‘సరిలేరు నీకెవ్వరు’ టాకీ పార్ట్ పూర్తయింది. నవంబర్ నాలుగు నుండి కేరళలో ఒక పాటను షూట్ చేయనున్నారు. అన్నపూర్ణ స్టూడియో, అలాగే RFC లో వేసిన సెట్స్ లో ఇంకో పాటను షూట్ చేస్తారు. ఈ పాటలతో టోటల్ షూటింగ్ పూర్తవుతుంది. సంక్రాంతి కానుకగా జనవరి 12 న సినిమా థియేటర్స్ లోకి రానుంది.


కళ్యాణ్ రామ్ హీరోగా వేగేశ్న సతీష్ దర్సకత్వం లో ఆదిత్య మ్యూజిక్ పతాకం పై నిర్మిస్తున్న ‘ఎంత మంచి వాడవురా’ సినిమా షూటింగ్ కేరళ లో జరుగుతుంది. ప్రస్తుతం కేరళలోని మున్నార్‌ తదితర ప్రదేశాల్లో ఆఖరి షెడ్యూల్‌ జరుగుతుంది. ఈ నెల 31 నుంచి నవంబర్‌ 10 వరకూ అక్కడ రెండు పాటలు, కీలక సన్నివేశాలు షూట్ చేయనున్నారు. కల్యాణ్‌రామ్‌, మెహరీన్‌పై రాజు సుందరం నృత్య దర్శకత్వంలో ఒక పాటను,కల్యాణ్‌రామ్‌, మెహరీస్‌, సుహాసిని, శరత్‌బాబు, వెన్నెల కిశోర్‌ తదితరులపై రఘు మాస్టర్‌ నృత్య దర్శకత్వంలో మరో పాటను షూట్‌ చేస్తారు. ఈ నెలాఖరు నుంచి డబ్బింగ్‌ కార్యక్రమాలు మొదలుపెట్టనున్నారు. జనవరి 15న సంక్రాంతి కానుకగా సినిమా విడుదల కానుంది.


నితిన్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ లో నిర్మిస్తున్న నిర్మిస్తున్న’రంగ్ దే’ సినిమా షూటింగ్ హైదరాబాద్ లో జరుగుతుంది. ప్రస్తుతం నితిన్ , కీర్తి సురేష్ లపై కొన్ని సన్నివేశాలు తీస్తున్నారు. పీ.సీ.శ్రీరాం సినిమాటోగ్రఫీ గా పనిచేస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు. వచ్చే ఏడాది సమ్మర్ కి రిలీజ్ ప్లాన్ చేస్తున్నారు.


నాగ‌శౌర్య‌, మెహరీన్ జంటగా రమణ తేజ దర్శకత్వంలో ‘తెరకెక్కుతున్న ‘అశ్వథ్థామ’ సినిమాకు సంబంధించి టాకీ పార్ట్ షూటింగ్ పూర్తయింది. మరో వైపు డబ్బింగ్ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. బ్యాలెన్స్ సాంగ్ ను త్వరలోనే చిక్ మంగుళూరులో షూట్ చేయబోతున్నారు. ఐరా క్రియేష‌న్స్ ప‌తాకం పై శంక‌ర్ ప్ర‌సాద్ ముల్పూరి స‌మ‌ర్ప‌ణ‌లో ఉషా ముల్పూరి నిర్మాత‌లుగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు శ్రీ‌చ‌ర‌ణ్‌ పాకాల మ్యూజిక్ కంపోజ్ చేస్తున్నాడు.


నాగచైతన్య , సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నారాయణ్ దాస్ కె నారంగ్, పి రామ్మోహన్ రావు నిర్మిస్తున్న సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. లేటెస్ట్ గా ఫిలిం నగర్ దేవాలయంలో కొన్ని సన్నివేశాలు షూట్ చేసిన ప్రస్తుతం సికింద్రాబాద్ లో మరి కొన్ని కీలక సన్నివేశాలు షూట్ చేస్తున్నారు.


ఆకాష్ పూరి, కేతిక శ‌ర్మ‌ జంటగా అనిల్ పాదూరి డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ‘రొమాంటిక్’ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది. ప్రస్తుతం రమ్య కృష్ణ -ఆకాశ్ లపై కొన్ని కీలక సన్నివేశాలను తీస్తున్నారు. పూరి జగన్నాథ్ -చార్మీ నిర్మిస్తున్న ఈ సినిమాకు సునీల్ కశ్యప్ మ్యూజిక్ అందిస్తున్నాడు.