షూటింగ్ అప్ డేట్స్

Sunday,October 06,2019 - 11:00 by Z_CLU

ప్రస్తుతం టాలీవుడ్ లో కొన్ని సినిమాలు జెట్ స్పీడులో షూటింగ్ జరుపుకుంటుండగా మరి కొన్ని సినిమాలు త్వరలోనే సెట్స్ పైకి వచ్చేందుకు రెడీ అవుతున్నాయి. బిజీ బిజీ షెడ్యూల్స్ తో, ఇంటరెస్టింగ్ కంటెంట్ తో తెరకెక్కుతున్న సినిమాల షూటింగ్ అప్ డేట్స్ మీ కోసం.


రాజమౌళి దర్శకత్వంలో తారక్ , రామ్ చరణ్ నటిస్తున్న మల్టీ స్టారర్ సినిమా ‘ఆర్.ఆర్.ఆర్’ షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ లో జరుగుతుంది. గండిపేట్ లో వేసిన ప్రత్యేకమైన సెట్ లో తారక్ పై కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కిస్తున్నారు. డి.వి.వి. దానయ్య నిర్మిస్తున్న ఈ భారీ బడ్జెట్ సినిమా వచ్చే జులైలో ప్రేక్షకుల ముందుకు రానుంది.


నందమూరి బాలకృష్ణ హీరోగా కె.యస్.రవికుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ రామోజీ ఫిలిం సిటీలో జరుగుతుంది. అక్టోబర్ 10నుంచి మహారాష్ట్ర ఖండాలలో షూటింగ్ చేయనున్నారు. దాదాపు పది రోజుల పాటు అక్కడ షూట్ జరగనుందని సమాచారం. హ్యాపీ మూవీస్ బ్యానర్ పై సి.కళ్యాణ్ నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కానుంది.

అల్లు అర్జున్,త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్ లో హారిక అండ్ హాసిని, గీతా ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘అల వైకుంఠపురములో’ షూటింగ్ హైదరాబాద్ అన్నపూర్ణ 7 ఏకర్స్ లో జరుగుతుంది. అక్టోబర్ లో ఫారిన్ లో ఓ షెడ్యూల్ ని ప్లాన్ చేస్తున్నారు. వచ్చే ఏడాది  జనవరి లో సంక్రాంతి కానుకగా సినిమా థియేటర్స్ లోకి రానుంది.

విజయ్ దేవరకొండ హీరోగాక్రాంతి మాధవ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘వరల్డ్ ఫేమస్ లవర్’ షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. విజయ్ , రాశి ఖన్నా లపై కొన్ని కీలక సన్నివేశాలు తీస్తున్నారు. క్రియేటివ్ కమర్షియల్ బ్యానర్ పై కె.యస్. రామారావు నిర్మిస్తున్నఈ సినిమా త్వరలోనే విడుదల కానుంది.

శర్వానంద్, సమంత జంటగాదిల్ రాజు నిర్మిస్తున్న సినిమా 2ఆఫ్ లోని కొన్ని సన్నివేశాలను హైదరాబాద్ లో షూట్ చేస్తున్నారు. అక్టోబర్ 10తో మొత్తం షూటింగ్ పూర్తి అవుతుంది. డిసెంబర్ లో రిలీజ్ కి ప్లాన్ చేస్తున్నారు.