జీ సినిమాలు : వీక్లీ రౌండప్

Sunday,October 06,2019 - 10:00 by Z_CLU

ప్రతీ వారం కొన్ని హాట్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను ఎట్రాక్ట్ చేస్తుంటాయి. మరి ఈ వారం ఆడియన్స్ ను బాగా ఆకట్టుకున్న ఫీచర్స్ ఏంటి? అలాగే ఈ వారంలో  విడుదలైన సినిమాల రివ్యూ ఏంటి..? టాలీవుడ్ లో ఈ వీక్ లేటెస్ట్ అప్ డేట్స్ ఏంటి….? ‘జీ సినిమాలు వీక్లీ రౌండప్’.

మెగా స్టార్ డ్రీం ప్రాజెక్ట్ ‘సైరా నరసింహ రెడ్డి’ భారీ అంచనాల నడుమ థియేటర్స్ లోకి వచ్చింది. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో రామ్ చరణ్ నిర్మాణంలో ఉయ్యాలవాడ నరసింహ రెడ్డి కథతో భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా తెలుగులో మరో గొప్ప సినిమాగా నిలిచిందా..? ‘సైరా’ విజయంతో తన కలను నెరవేర్చుకోవాలనుకున్న చిరు కోరిక నేరవేరిందా..? ఇంతకీ సైరా అభిమానులను అలరించి బ్లాక్ బస్టర్ అనిపించుకుందా…? జీ సినిమాలు ఎక్స్ క్లూజీవ్ రివ్యూ.రివ్యూ పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

రామ్ -పూరి కాంబినేషన్ లో వచ్చిన సక్సెస్ ఫుల్ సినిమా ‘ఇస్మార్ట్ శంకర్’ నుండి వారానికో వీడియో సాంగ్ విడుదలవుతూ సందడి చేస్తుంది. ఇప్పటికే ‘దిమాక్ ఖరాబ్’, ‘ఇస్మార్ట్ శంకర్ టైటిల్ సాంగ్ ‘,’బోనాలు సాంగ్’,’ఉండిపో’ వీడియో సాంగ్స్ ను విడుదల చేసిన మేకర్స్ లేటెస్ట్ గా ‘జిందాబాద్’ వీడియో సాంగ్ ను వదిలారు. ప్రస్తుతం ఈ సాంగ్ మిలియన్స్ వ్యూస్ తో దూసుకెళ్తోంది. త్వరలోనే ‘జీ తెలుగు’ లో ఈ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా ప్రసారం కానుంది.జిందాబాద్ వీడియో సాంగ్ లింక్.

మ్యాచో హీరో గోపీచంద్ హీరో గా మాస్ డైరెక్టర్ సంపత్ నంది దర్శకత్వంలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్ పై శ్రీనివాసా చిట్టూరి నిర్మించనున్న భారీ చిత్రం అఫీషియల్ గా లాంఛ్ అయింది. తమన్న ఈ సినిమాలో గోపీచంద్ సరసన హీరోయిన్ గా నటించనుంది. ఓపెనింగ్ కు ఆమె కూడా వచ్చింది. బోయపాటి క్లాప్ తో మూవీ ప్రారంభమైంది. పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

హీరోయిన్ వేద అలియాస్ అర్చన త్వరలోనే పెళ్లి చేసుకోబోతోంది. తాజాగా హైదరాబాద్ లోని రాడిసన్ హోటల్ లో  నిశ్చితార్థం గ్రాండ్ గా జరిగింది. ఓ హెల్త్-కేర్ కంపెనీలో వైస్-ప్రెసిడెంట్ స్థాయిలో ఉన్న జగదీష్ అనే వ్యక్తిని పెళ్లాడబోతోంది వేద.

ఆకాశ్ పూరి, కేతికా శ‌ర్మ జంట‌గా న‌టిస్తున్న చిత్రం ‘రొమాంటిక్‌’ ఫస్ట్ లుక్ విడుదలైంది. అనిల్ పాదూరి ద‌ర్శ‌కుడు. `ఇస్మార్ట్ శంక‌ర్‌` వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత పూరి జ‌గ‌న్నాథ్ టూరింగ్ టాకీస్‌, పూరి క‌నెక్ట్స్ బ్యాన‌ర్స్‌పై పూరి జ‌గ‌న్నాథ్‌, చార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

ముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ సంయుక్తంగా  శ్రీవిష్ణు హీరోగా హాసిత్ గోలి దర్శకత్వంలో ఓ చిత్రాన్ని నిర్మించటానికి సన్నాహాలు చేస్తోంది. ఈ విషయాన్ని అఫీషియల్ అనౌన్స్ చేసారు. పూర్తిగా చదవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.