'అర్జున్ సురవరం' రిలీజ్ డేట్ ఫిక్స్ !

Sunday,October 06,2019 - 12:12 by Z_CLU

నిఖిల్‌ లేటెస్ట్ మూవీ ‘అర్జున్ సురవరం’ రిలీజ్ డేట్ లాక్ అయింది. ఇప్పటికే పలుమార్లు పోస్ట్ పోన్ అవుతూ టైటిల్ మార్చుకున్న ఈ సినిమాను నవంబర్ 8న రిలీజ్ చేయబోతున్నారు. త్వరలోనే ఈ డేట్ ను అఫీషియల్ గా అనౌన్స్ చేయబోతున్నారు. తమిళ్ సూపర్ హిట్ సినిమా ‘కనిథన్’ కు రీమేక్ గా తెరకెక్కిన ఈ సినిమాలో నిఖిల్ జర్నలిస్ట్ గా కనిపించనున్నాడు. లావణ్య త్రిపాఠి హీరోయిన్‌ గా నటించింది.

ఠాగూర్‌ మధు సమర్పణలో మూవీ డైనమిక్స్‌ ఎల్‌ఎల్‌ పి అండ్‌ ఔరా ఎంటర్‌ టైన్మెంట్స్‌ ప్రై.లి. పతాకాలపై రాజ్‌ కుమార్‌ ఆకెళ్ల, కావ్య వేణుగోపాల్‌ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాలో వెన్నెల కిషోర్, పోసాని కృష్ణ‌ముర‌ళి, ప్ర‌గ‌తి, స‌త్య‌, త‌రుణ్ అరోరా, రాజా ర‌వీంద్ర, నాగినీడు కీలక పాత్రలో నటించారు.