శరవేగంగా సిద్ధమౌతున్న శతమానం భవతి

Tuesday,November 01,2016 - 03:58 by Z_CLU

ఉత్తమ కుటుంబ కథా చిత్రాల నిర్మాత గా పేరున్న దిల్ రాజు నిర్మాణం లో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ శర్వానంద్ హీరో గా వేగేశ్న సతీష్ దర్శకత్వం లో నిర్మిస్తున్న చిత్రం “శతమానం భవతి”. అనుపమ పరమేశ్వరన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రం తదుపరి షెడ్యూల్ రేపటి నుండి ప్రారంభం అవుతుంది. నవంబరు చివరి వరకు సాగే ఈ షెడ్యూల్ తో షూటింగ్ మొత్తం పూర్తవుతుంది.  2017 సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు చిత్ర బృందం తెలిపింది.

1476080842_telugu-movie-shatamanam-bhavati-first-look-poster-revealed-eve-vijayadashami-festival-film

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ లో వచ్చిన బొమ్మరిల్లు చిత్రం తండ్రీ కొడుకుల మధ్య ఉండే సంబంధాన్ని అందంగా ప్రతిబింబించింది. ఇప్పుడు శతమానం భవతి సినిమాలో తాతా మనవళ్ల మధ్య ఉండే బంధాన్ని అందంగా చూపించబోతున్నారు. తమ బ్యానర్ కి బొమ్మరిల్లు ఎంత పేరు తెచ్చిపెట్టిందో, ఈ శతమానం భవతి చిత్రం కూడా అంతే పేరు తెస్తుందని నమ్ముతున్నాడు నిర్మాత దిల్ రాజు.