అఫీషియల్ - శాతకర్ణిలో శివకుమార్

Tuesday,November 01,2016 - 04:19 by Z_CLU

బాలకృష్ణ ప్రతిష్టాత్మక వందో చిత్రం గౌతమీపుత్ర శాతకర్ణిలో కన్నడ స్టార్ శివరాజ్ కుమార్ నటించబోతున్నాడంటూ గతంలో చాలా వార్తలు వచ్చాయి. ఎట్టకేలకు వీటిపై యూనిట్ నుంచి క్లారిటీ వచ్చింది. శాతకర్ణి సినిమాలో శివరాజ్ కుమార్ గెస్ట్ రోల్ పోషిస్తున్నారనే విషయాన్ని డైరక్టర్ క్రిష్ కన్ ఫర్మ్ చేశాడు. వచ్చే వారం నుంచి క్రిష్-బాలయ్య మధ్య వచ్చే సన్నివేశాల్ని చిత్రీకరించనున్నారు. కన్నడ కంఠీవర శివరాజ్ కుమార్ ఫ్యామిలీ హీరోల నుంచి ఒక నటుడు పరభాషా చిత్రంలో నటించడం ఇదే ఫస్ట్ టైం. సినిమాలో అత్యంత కీలకమైన పాత్ర కోసం శివరాజ్ కుమార్ ను తీసుకున్నారు. దర్శకుడు క్రిష్ క్యారెక్టర్ చెప్పిన వెంటనే శివరాజ్ కుమార్ నటించడానికి ఒప్పుకున్నారు. మరీ ముఖ్యంగా నందమూరి నటిసింహం సినిమాలో నటించడాన్ని గౌరవంగా భావించారు శివరాజ్ కుమార్. సంక్రాంతి కానుకగా జనవరి 12న గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా థియేటర్లలో సందడి చేయనుంది.