నైజాం లో 'శతమానం భవతి' రికార్డ్

Tuesday,January 31,2017 - 09:14 by Z_CLU

శర్వానంద్ అనుపమ నటించిన ‘శతమానం భవతి’ సంక్రాంతి కి రిలీజ్ అయి గ్రాండ్ హిట్ సాధించిన సంగతి  తెలిసిందే.  ఈ సినిమా ఇప్పటికీ  భారీ కలెక్షన్స్ సాధిస్తూ అదే స్పీడ్ తో ముందుకెళ్తుంది. నైజాం లో ఒక స్టార్ హీరో సినిమాకు సమానంగా కలెక్షన్స్ సాధిస్తూ దూసుకుపోతుంది ఈ సినిమా.

ఇప్పటికే ఓవరాల్ గా 25 కోట్ల షేర్ మార్క్ దాటేసిన ఈ సినిమా ఒక్క నైజాం లోనే 9.7 కోట్ల షేర్ సాధించి 10 కోట్ల దిశగా పరిగెడుతుంది. నైజాం లో ఈ సినిమాకొస్తున్న కలెక్షన్స్ చూస్తుంటే ఈ వారం లోనే 10 కోట్ల షేర్ సాధించి ఓవరాల్ 30 కోట్లు సాధించడం ఖాయం అని అంటున్నారు సినీ విశ్లేషకులు..