అమీర్ ఖాన్ ట్రాక్ లో యంగ్ టైగర్

Tuesday,January 31,2017 - 11:55 by Z_CLU

NTR మేకోవర్ బిగిన్ అయింది. బాబీ డైరెక్షన్ లో రానున్న తన నెక్స్ట్ సినిమా కోసం భారీగా కసరత్తులు చేస్తున్నాడు యంగ్ టైగర్. ఏ సినిమా టైంలో డెసిషన్ తీసుకున్నాడో ఎగ్జాక్ట్ గా తెలీదు కానీ, సినిమా సినిమాకి సబ్జెక్ట్ లో మాత్రమే కాదు, బాడీ ట్రాన్స్ ఫర్మేషన్ లోను వేరియేషన్స్ కంపల్సరీ అని డిసైడయ్యాడు యంగ్ టైగర్.  చూస్తుంటే NTR కూడా బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ ట్రాక్ లోనే కరియర్ ని ప్లాన్ చేసుకుంటున్నాడనిపిస్తుంది.

భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న అమీర్ ఖాన్, డిఫెరెంట్ సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్. యంగ్ హంక్ లుక్ దగ్గర్నుంచి రీసెంట్ సినిమా దంగల్ లో 40 పైబడిన వ్యక్తిలా పొట్టతో కనిపించడానికి కూడా వెనకాడని అమీర్… సినిమా కోసం కుచ్ భీ కరేగా అని ప్రూవ్ చేసుకున్నాడు. బాడీలో ఏ రేంజ్ ట్రాన్స్ ఫర్మేషన్ కైనా రెడీ అంటున్న NTR ని చూసినా ఇప్పుడు అదే ఫీలింగ్ కలుగుతుంది.

ntr-bobby-movie-updates

నయా మూవీలో 3 డిఫెరెంట్ క్యారెక్టర్స్ లో కనిపించనున్నాడట యంగ్ టైగర్. అందులో ఒక క్యారెక్టర్ కోసం వెయిట్ కూడా పెరగనున్నాడు. అలా ఈ సినిమాలో మళ్ళీ బొద్దు NTR ని చూడబోతున్నాం అని డిసైడ్ అయ్యే లోపు, NTR జస్ట్ ఆ ఒక్క లుక్ లోనే కాదు, సిక్స్ ప్యాక్ లోను కనిపించబోతున్నాడనే ఇంకో అప్ డేట్ దొరికింది. ఈ లుక్ కోసం టెంపర్ సినిమా టైం లో NTR కి ట్రైనింగ్ ఇచ్చిన ట్రైనర్ ఆల్రెడీ తన పని స్టార్ట్ చేసేశాడు. సినిమా కోసం ఇంత రిస్క్ తీసుకుంటున్నాడంటే NTR ని బాబీ స్టోరీ ఏ రేంజ్ లో ఇంప్రెస్ చేసి ఉంటుందో ఈజీగా గెస్ చేయొచ్చు.