అనుమానం కూడా అనవసరం

Thursday,January 12,2017 - 10:00 by Z_CLU

బాహుబలి షూటింగ్ ప్యాకప్ అయిపోయింది. స్టార్స్ దగ్గరి నుండి గుర్రాలు ఏనుగులు కూడా వారి వారి స్థావరాలకు చేరిపోయాయి. కానీ బాహుబలి కంక్లూజన్ అంతకు ముందే అనౌన్స్ చేసిన డేట్ కి థియేటర్స్ లోకి వస్తుందా…? ఇదే ఇప్పుడు టాలీవుడ్ లో తాండవం చేస్తున్న పెద్ద క్వశ్చన్ మార్క్.

నిజానికి ఈ క్వశ్చన్ రేజ్ అవ్వడం వెనక ఓ పెద్ద రీజనే ఉంది. ఏప్రిల్ చూస్తే ఎంతో దూరంలో లేదు. బాహుబలి సినిమా అంటేనే హై ఎండ్ గ్రాఫికల్ విజన్. అలాంటిది ఇంత తక్కువ టైం లో సినిమా, ఎడిటింగ్ రూమ్ నుండి అంత ఈజీగా బయటికి వస్తుందా అంటే కొద్దిగా కష్టమే.. ఇదీ బాహుబలి ఫ్యాన్స్ ఎస్టిమేషన్.

అందుకే అలాంటి ఎస్టిమేషన్స్ కి, అనుమానాలకి  పెద్ద ఫుల్ స్టాప్ పెట్టేశాడు ప్రొడ్యూసర్ శోభు యార్లగడ్డ. టైం ప్రకారం షెడ్యూల్స్ పూర్తి చేసుకున్న బాహుబలి, పక్కా ప్లానింగ్ ప్రకారం తక్కిన పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా జరుపుకుంటుందని, ఏ మాత్రం డిలేస్ లేకుండా సినిమా ఏప్రిల్ 28 న థియేటర్స్ లో ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు.